నీపై నేనే గెలిచాను బ్రో: హార్దిక్‌

Hardik Pokes Fun At Brother Krunal After Almost Knocking Head Off - Sakshi

న్యూఢిల్లీ:  దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కోసం అన్మదమ్ములు కృనాల్‌ పాండ్యా, హార్దిక్‌ పాండ్యా తీవ్రంగా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. ఈనేపథ్యంలో నెట్స్‌లో క్రునాల్‌ వేసిన బంతిని స్ట్రైట్‌ డ్రైవ్‌ రూపంలో భారీ షాట్‌ కొట్టాడు హార్దిక్‌.  అయితే ఆ బంతి త్రుటిలో కృనాల్‌ తలను తాకేదే!  కానీ అతడు తల కొద్దిగా పక్కకు తిప్పడంతో ప్రమాదం తప్పింది. ఈ వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన హార్దిక్‌.. ‘పాండ్యా వర్సెస్‌ పాండ్యా ట్రైనింగ్‌’ అని క్యాప్షన్‌ చేర్చాడు. ‘ఈసారి నీపై నేనే గెలిచాను బ్రో’ అని సరదాగా కామెంట్‌ కూడా రాసుకొచ్చాడు.

అదే సమయంలో కృనాల్‌ కూడా తమ్ముడికి ధీటుగా తానూ ఓ వీడియో పోస్ట్‌ చేశాడు. అందులో క్రునాల్‌ వేసిన ఓ బంతికి హార్దిక్‌ బౌల్డ్డ్‌ అయినంత పని అయింది. ‘హా..హా.. ఈ వీడియో ఎందుకు అప్‌లోడ్‌ చేయ లేదు బ్రదర్‌’ అని కృనాల్‌ జోక్‌ చేశాడు. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు హార్దిక్‌ పాండ్యా తిరిగి జట్టులోకి వస్తే, కృనాల్‌కు అవకాశం కల్పిస్తూ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. స్పిన్‌ విభాగంలో కాస్త వైవిధ్యం కావాలనే ఉద్దేశంతో కుల్దీప్‌ యాదవ్‌, చహల్‌లను తప్పించి కృనాల్‌, వాషింగ్టన్‌ సుందర్‌లకు అవకాశం ఇచ్చారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top