జిమ్నాస్ట్‌ అరుణకు ఘనస్వాగతం | Gymnast Aruna Gets Honour in Shamshabad Airport | Sakshi
Sakshi News home page

జిమ్నాస్ట్‌ అరుణకు ఘనస్వాగతం

Mar 2 2018 2:52 PM | Updated on Mar 2 2018 2:52 PM

Gymnast Aruna Gets Honour in Shamshabad Airport - Sakshi

ప్రపంచ కప్‌ జిమ్నాస్టిక్స్‌లో పతకం సాధించి చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి బుద్దా అరుణ రెడ్డికి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం లభించింది.

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ కప్‌ జిమ్నాస్టిక్స్‌లో పతకం సాధించి చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి బుద్దా అరుణ రెడ్డికి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం లభించింది. ప్రపంచకప్‌లో పతకాన్ని సాధించిన తొలి భారత జిమ్నాస్ట్‌గా గుర్తింపు పొందిన అరుణను రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ (శాట్స్‌) చైర్మన్‌ వెంకటేశ్వర రెడ్డి ఘనంగా సన్మానించారు.

అనంతరం శంషాబాద్‌ నుంచి హైదర్‌ గూడ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ ప్రపంచ్‌ కప్‌ జిమ్నాస్టిక్స్‌లో కాంస్య పతకం సాధించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. కుటుంబ సభ్యుల సహకారం, ప్రభుత్వ సహాకారంతో ఈ మెడల్‌ సాధించినట్టు ఆమె పేర్కొన్నారు. జిమ్నాస్టిక్స్‌ లో బంగారు పతకం సాధించడమే తన లక్ష్యమని అరుణ రెడ్డి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement