ఆలిండియా జిమ్నాస్టిక్స్ టోర్నీలో రెండో స్థానం
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా లెవెల్ వైజ్ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ ప్లేయర్లు అదరగొట్టారు. న్యూఢిల్లీలోని ద జిమ్నాస్టిక్ అకాడమీలో ఇటీవల జరిగిన ఈ టోర్నీలో తెలంగాణ చిన్నారులు 25 రజత పతకాలు, రెండు కాంస్య పతకాలతో మెరిశారు. మొత్తం 27 పతకాలు సొంతం చేసుకొని ఓవరాల్‌గా రెండో స్థానాన్ని దక్కించుకున్నారు.
టేబుల్ వాల్ట్, అన్‌ఈవెన్ బార్స్, బ్యాలెన్సింగ్ బీమ్, ఫ్లోర్ ఎక్సర్‌సైజ్ ఈవెంట్స్‌లో పోటీలు నిర్వహించారు. ఈ టోర్నీలో పతకాలు సాధించిన తెలంగాణ జిమ్నాస్ట్‌లను బుధవారం హైదరాబాద్‌లోని వందన బద్రుక ఇన్‌స్టిట్యూట్ కల్పతరులో అంతర్జాతీయ ప్లేయర్, జాతీయ చాంపియన్, జాతీయ జడ్జి ప్రియాంక అభినందించింది. ఈ టోర్నీలో పతకాలు గెలిచిన తెలంగాణ జిమ్నాస్ట్‌ల వివరాలు ఇలా ఉన్నాయి.
బాలికలు (లెవెల్–1): హియా యాదవ్, ప్రణవి షా, జెకా నవాజ్, అయేషా సిద్దిఖి, ఆద్య కపూర్, మెహర్ అగర్వాల్. బాలురు (లెవెల్–1): అన్షుల్ యాదవ్, ఆకుల అద్వైత్, చందూరి అద్వైత్, గొల్ల విదిత్, ఎన్.సిద్విక్ రెడ్డి, రేయాంశ్ రావు.
బాలికలు (లెవెల్–2): మాన్వీ రెడ్డి, మండవ మైరా, అనన్య రెడ్డి, కృషా జైన్, కృత్యా కొయిరాలా, వర్ణిక రెడ్డి, రియానా రెడ్డి, ఆర్ణవి చందూరి, ఆముక్త. బాలురు (లెవెల్–2): చొక్కారపు లౌక్య విరాట్. బాలికలు (లెవెల్–3): ఇనారా రుక్మిణి. బాలికలు (లెవెల్–4): సిమోన్ పెస్తోంజి. బాలికలు (లెవెల్–6): ఖుషీ రాయ్.


