జోస్‌ బట్లర్‌ విధ్వంసం.. ఒకే ఓవర్‌లో 23 పరుగులు! వీడియో | Jos Buttler smashes massive trademark ramp shot in 23-run over against Mukesh Kumar in DC | Sakshi
Sakshi News home page

IPL 2026: జోస్‌ బట్లర్‌ విధ్వంసం.. ఒకే ఓవర్‌లో 23 పరుగులు! వీడియో

Apr 8 2026 9:08 PM | Updated on Apr 8 2026 9:36 PM

Jos Buttler smashes massive trademark ramp shot in 23-run over against Mukesh Kumar in DC

ఐపీఎల్‌-2026లో గుజ‌రాత్ టైటాన్స్ స్టార్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ జోస్ బ‌ట్ల‌ర్ ఎట్టకేల‌కు తన రిథ‌మ్‌ను అందుకున్నాడు. ఈ ధ‌న‌ధాన్ లీగ్‌లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో బట్ల‌ర్ మెరుపు అర్ధశతకంతో విరుచుకుపడ్డాడు.

ఈ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఢిల్లీ బౌలర్లను ఉతికారేశాడు. ముఖ్యంగా ఢిల్లీ పేసర్ ముఖేష్ కుమార్‌కు బట్లర్ చుక్కలు చూపించాడు. గుజరాత్ ఇన్నింగ్స్  4వ ఓవర్ వేసిన ముఖేష్ కుమార్ బౌలింగ్‌లో బట్లర్ ఏకంగా 23 పరుగులు పిండుకున్నాడు. ఇందులో మూడు భారీ సిక్సర్లు ఉండటం విశేషం. 

ఓవర్ మొదటి బంతికే తన ఫేవరెట్ 'ర్యాంప్ షాట్'తో సిక్సర్ కొట్టి బౌలర్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. బట్లర్ మొత్తంగా 27 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 52 పరుగులు చేశాడు. అతడి బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.

తుది జ‌ట్లు
గుజరాత్ టైటాన్స్: శుభమన్ గిల్(కెప్టెన్‌), సాయి సుదర్శన్, జోస్ బట్లర్(వికెట్ కీప‌ర్‌), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, అశోక్ శర్మ

ఢిల్లీ క్యాపిటల్స్:  కేఎల్‌ రాహుల్(వికెట్ కీప‌ర్‌), పాతుమ్ నిస్సాంక, నితీష్ రాణా, విప్రజ్ నిగమ్, అక్షర్ పటేల్(కెప్టెన్‌), డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, కుల్దీప్ యాదవ్, లుంగి ఎన్గిడి, టి నటరాజన్, ముఖేష్ కుమార్

Advertisement
 
Advertisement
Advertisement