జ‌ట్టు నుంచి తీసేమ‌న్నారు.. క‌ట్ చేస్తే! బౌండ‌రీల‌తో బీభ‌త్సం | Washington Sundar gets maiden fifty after 10 years of IPL | Sakshi
Sakshi News home page

IPL 2026: జ‌ట్టు నుంచి తీసేమ‌న్నారు.. క‌ట్ చేస్తే! బౌండ‌రీల‌తో బీభ‌త్సం

Apr 8 2026 11:02 PM | Updated on Apr 8 2026 11:02 PM

Washington Sundar gets maiden fifty after 10 years of IPL

టీమిండియా స్టార్ ఆల్‌రౌండ‌ర్ వాషింగ్ట‌న్ సుంద‌ర్ త‌న ఐపీఎల్ హాఫ్‌ సెంచ‌రీని సాధించాడు. ఐపీఎల్‌-2026లో గుజ‌రాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న సుంద‌ర్‌.. బుధ‌వారం ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో మ్యాచ్‌లో అద్భుతమైన అర్ధ శ‌త‌కంతో మెరిశాడు. నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వ‌చ్చిన సుంద‌ర్ ఢిల్లీ బౌల‌ర్ల‌ను ఉతికారేశాడు.

వాషీ కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్‌తో క‌లిసి స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించాడు. సుంద‌ర్‌ కేవలం 32 బంతుల్లో  5 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. అయితే తొలి రెండు మ్యాచ్‌ల్లో మాత్రం సుంద‌ర్ బంతితో పాటు బ్యాట్‌తో కూడా విఫ‌ల‌మ‌య్యాడు. దీంతో అత‌డిని తుది జ‌ట్టు నుంచి త‌ప్పించాల‌ని చాలా మంది డిమాండ్ చేశారు. 

కానీ గుజ‌రాత్ మేనెజ్‌మెంట్ అత‌డిపై న‌మ్మ‌కం ఉంచింది. త‌న అద్భుత ఇన్నింగ్స్‌తో మేనెజ్‌మెంట్ న‌మ్మ‌కాన్ని సుంద‌ర్ నిల‌బెట్టుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. గుజరాత్‌ బ్యాటర్లలో సుంద‌ర్‌తో పాటు శుభ్‌మన్‌ గిల్‌(70), జోస్‌ బట్లర్‌(52) హాఫ్‌ సెంచరీలతో సత్తాచాటారు. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్‌ కుమార్‌ రెండు, ఎంగిడి, కుల్దీప్‌ యాదవ్‌ తలా వికెట్‌ సాధించారు.


 

 

Advertisement
 
Advertisement
Advertisement