ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా ఆదివారం రాత్రి ఇక్కడ కింగ్స్ పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ లయన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
మొహాలి:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా ఆదివారం రాత్రి ఇక్కడ కింగ్స్ పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ లయన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇది గుజరాత్ కు నామమాత్రపు కాగా, కింగ్స్ పంజాబ్ కు మాత్రం ప్లే ఆఫ్ అవకాశాల్ని మెరుగుపరుచుకోవడానికి మంచి అవకాశం. దాంతో గుజరాత్ పరువు దక్కించుకోవాలని భావిస్తుండగా, కింగ్స్ పంజాబ్ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది.
కింగ్స్ పంజాబ్ తుది జట్టు: మ్యాక్స్ వెల్(కెప్టెన్),హషీమ్ ఆమ్లా, గప్టిల్, షాన్ మార్ష్, సాహా, అక్షర్ పటేల్, గుర్ కీరత్ సింగ్, మోహిత శర్మ, సందీప్ శర్మ, వరుణ్ అరోన్, నటరాజన్
గుజరాత్ తుది జట్టు: సురేశ్ రైనా(కెప్టెన్), డ్వేన్ స్మిత్, ఇషాన్ కిషన్, అరోన్ ఫించ్, దినేశ్ కార్తీక్, రవీంద్ర జడేజా, ఫాల్కనర్, కులకర్ణి, సంగ్వాన్, బాసిల్ తంపి, అంకిత్ సోని