చివరి టెస్ట్‌: కుక్‌కు ఘనస్వాగతం

A Guard of Honour for Alastair Cook As He Walked Out To Bat in His Final Test  - Sakshi

చివరి మ్యాచ్‌ ఆడుతున్న ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌

లండన్‌ : భారత్‌తో జరుగుతున్న చివరి టెస్ట్‌లో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌, ఓపెనర్‌ అలిస్టర్‌ కుక్‌కు ఘనస్వాగతం లభించింది. కుక్‌ ఈ మ్యాచ్‌తో అతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. ప్రేక్షకుల కరతాల ధ్వనుల మధ్య.. అలిస్టర్‌ కుక్‌ మైదానంలోకి రాగా.. సముచిత గౌరవం కల్పిస్తూ టీమిండియా క్రికెటర్లు ఓ వరుసలో నిలబడి ఘన స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన వీడియోను ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు ట్వీట్‌ చేయగా.. యావత్‌ క్రీడా అభిమానులు కుక్‌ను కొనియాడుతున్నారు. 

టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ఆరో స్థానం, సెంచరీల్లో టాప్‌–10లో చోటు, నిర్విరామంగా 159 టెస్టులు ఆడిన క్రమశిక్షణ కుక్‌కే సొంతం. ఇప్పటికే  సిరీస్‌ నెగ్గిన ఇంగ్లండ్‌ ఈ మ్యాచ్‌ నెగ్గి కుక్‌ను విజయంతో సాగనంపాలని ఉవ్విళ్లురుతోంది.  మరోవైపు సిరీస్‌ చేజారిన కోహ్లి సేన ఎలాగైనా మ్యాచ్‌ నెగ్గి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది.   

చదవండి: అలిస్టర్‌ కుక్‌ అల్విదా

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top