తదుపరి దశకు చేరుకోవాలంటే గెలుపు తప్పనిసరి.. మరోవైపు ప్రత్యర్థి జట్టుకు డ్రా చేసుకున్నా ఆ అవకాశం దక్కుతుంది. దీనికి తగ్గట్టుగానే మ్యాచ్ కూడా నిర్ణీత సమయం దాకా 1-1తో డ్రా దిశగానే సాగింది.
ఫోర్టలెజా: తదుపరి దశకు చేరుకోవాలంటే గెలుపు తప్పనిసరి.. మరోవైపు ప్రత్యర్థి జట్టుకు డ్రా చేసుకున్నా ఆ అవకాశం దక్కుతుంది. దీనికి తగ్గట్టుగానే మ్యాచ్ కూడా నిర్ణీత సమయం దాకా 1-1తో డ్రా దిశగానే సాగింది. దీంతో ఇక ఐవరీకోస్ట్ నాకౌట్‌కు చేరడం ఖాయమనే భావనలో ఉన్నారంతా. కానీ, ఇంతలోనే అద్భుతం జరిగింది. ఇంజ్యూరీ టైమ్ (91వ ని.)లో గ్రీస్‌కు లభించిన పెనాల్టీని సద్వినియోగం చేసుకుంటూ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ జార్జియస్ సమారస్.. ఐవరీ గోల్‌కీపర్‌ను బోల్తా కొట్టిస్తూ బంతిని నెట్‌లోకి పంపాడు. ప్రపంచకప్ చరిత్రలో తమ జట్టును తొలిసారి గ్రూప్ దశను దాటించాడు.
ఆరంభం నుంచి హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో 42వ నిమిషంలో ఆండ్రియాస్ సమారిస్ తొలిగోల్ నమోదు చేసి గ్రీస్‌కు ఆధిక్యాన్నందించాడు. అయితే 74వ నిమిషంలో గెర్విన్హో ఇచ్చిన పాస్‌ను విల్‌ఫ్రెడ్ నేరుగా గోల్‌పోస్ట్‌లోకి పంపించి స్కోరును సమం చేశాడు. డ్రాతో నాకౌట్‌కు చేరుతున్నామన్న ఐవరీ ఆశలపై సమారస్ నీళ్లుజల్లాడు. పెనాల్టీని గోల్‌గా మలచి 2-1తో గ్రీస్‌ను గెలిపించాడు.