టోక్యో ఆతిథ్యమివ్వనున్న 2020 ఒలింపిక్స్‌లో బాక్సింగ్ ఈవెంట్‌లో మహిళల కేటగిరీలను 3 నుంచి 5కు పెంచి...
2020 టోక్యో ఒలింపిక్స్‌లో ఐదు కేటగిరీల్లో పోటీలు
న్యూఢిల్లీ: టోక్యో ఆతిథ్యమివ్వనున్న 2020 ఒలింపిక్స్‌లో బాక్సింగ్ ఈవెంట్‌లో మహిళల కేటగిరీలను 3 నుంచి 5కు పెంచి... పురుషుల కేటగిరీలను 10 నుంచి 8కి కుదించాలని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) నిర్ణయించింది. టోక్యోలో మహిళా బాక్సర్లకు 51 కేజీలు, 57 కేజీలు, 60 కేజీలు, 69 కేజీలు, 75 కేజీల్లో పోటీలు నిర్వహిస్తారు. లండన్, రియో ఒలింపిక్స్‌లో మహిళా బాక్సర్లకు 51 కేజీలు, 60 కేజీలు, 75 కేజీల్లో పోటీలు నిర్వహించారు. పురుషుల విభాగంలో తొలగించే రెండు కేటగిరీలను త్వరలో ప్రకటించనున్నట్లు ఐఓసీ వర్గాలు తెలిపాయి. మహిళా కేటగిరీలను పెంచడం భారత్‌కు లాభిస్తుందని చీఫ్ కోచ్ గుర్‌బ„ŠS సింగ్ సంధు తెలిపారు.