చెన్నైయిన్‌పై గోవా విజయం | Goa victory over chennaiyin | Sakshi
Sakshi News home page

చెన్నైయిన్‌పై గోవా విజయం

Dec 1 2016 11:55 PM | Updated on Oct 2 2018 8:39 PM

చెన్నైయిన్‌పై గోవా విజయం - Sakshi

చెన్నైయిన్‌పై గోవా విజయం

పారుుంట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో ఉన్న చెన్నైయిన్ ఎఫ్‌సీ, ఎఫ్‌సీ గోవా జట్ల మధ్య జరిగిన ఐఎస్‌ఎల్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో .....

ఫటోర్డా: పారుుంట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో ఉన్న చెన్నైయిన్ ఎఫ్‌సీ, ఎఫ్‌సీ గోవా జట్ల మధ్య జరిగిన ఐఎస్‌ఎల్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో గోల్స్ వర్షం కురిసింది. గురువారం జరిగిన ఈ హోరాహోరీ పోరులో చివరికి 5-4 తేడాతో గోవా నెగ్గింది. ఐఎస్‌ఎల్ చరిత్రలో ఓ మ్యాచ్‌లో 9 గోల్స్ నమోదవడం ఇదే తొలిసారి.

గోవా తరఫున లూయిజ్ (6, 76వ నిమిషాల్లో), టవోరా (68, 90)రెండేసి గోల్స్ సాధించగా గోంజాలెజ్ (21) మరో గోల్ చేశాడు. చెన్నైరుున్‌కు రింజువాలా (4), అర్నోనిల్ (గోవా ఆటగాడి సొంత గోల్ 14), ఒమగ్‌బెమి (28), రీజ్ (88) గోల్స్ చేశారు. ఈ రెండు జట్లకిదే చివరి లీగ్ మ్యాచ్ కాగా ఇప్పటికే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించారుు.

Advertisement
 
Advertisement
Advertisement