ఆ గేమ్స్ మాకొద్దు:స్వాతంత్ర్య సమరయోధులు | Goa freedom fighters against Lusofonia Games in state | Sakshi
Sakshi News home page

ఆ గేమ్స్ మాకొద్దు:స్వాతంత్ర్య సమరయోధులు

Sep 2 2013 3:50 PM | Updated on Sep 1 2017 10:22 PM

అంతర్జాతీయంగా ఆదరణ కల్గిన గేమ్స్ ఏ వేదికపై జరిగినా ప్రజలు, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చి కొండత అండగా నిలుస్తూ ఉండటం మనకు బాగా తెలిసిన విషయం.

పనాజీ: అంతర్జాతీయంగా ఆదరణ కల్గిన గేమ్స్ ఏ వేదికపై జరిగినా ప్రజలు, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చి కొండత అండగా నిలుస్తూ ఉండటం మనకు బాగా తెలిసిన విషయం. కాగా, గోవా రాష్ట్రంలో జరప తలపెట్టిన లూసోఫోనియా గేమ్స్ ను మాత్రం అక్కడి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం లూసోఫోనియా గేమ్స్ గుర్తింపు పొందిన ఈ గేమ్సను .. గతంలో పోర్చ్ గీసు కామన్ వెల్త్ గేమ్స్ గా వ్యవహరించేవారు.
 

గతంలో పోర్చుగీసు వారి ఆధిపత్యం చలాయించడంతో రాష్ట్ర ప్రజలు ఇప్పటికీ దుర్భరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారని గోవా స్వాతంత్ర్య సమరయోధుల అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రకాంత్ కంక్రే అభిప్రాయపడ్డారు.  ఆ గేమ్స్  ఇక్కడ నిర్వహించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఆ దేశానికి సంబంధించిన లూసోఫోనియా గేమ్స్ ఇక్కడ ఎలా నిర్వహించాలనుకుంటున్నారని మండిపడ్డారు.  గోవాను 450 సంవత్సరాలు పోర్చుగీసు వాసులు పరిపాలించారంటూ ఆక్కడి ప్రజలు అపహాస్యం చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.  దీనికి సంబంధించి నవంబర్ లో జరిగే ఈ గేమ్స్ లో పాల్గొనకూడదని ఆ రాష్ట్ర ఆటగాళ్లకు ఆయన ఒక విజ్ఞాపన పత్రాన్ని పంపారు. కాగా గోవా ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గురుదత్త్ భక్తా మాత్రం దీన్ని ఖండించారు. ఒలింపిక్స్ క్రీడలు యథావిదిగా జరుగుతాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement