breaking news
Lusofonia Games
-
కొత్తగా... వింతగా..!
అన్ని దేశాలూ ఆడితే ఒలింపిక్స్... కామన్వెల్త్ దేశాలు మాత్రమే ఆడితే కామన్వెల్త్ గేమ్స్... మరి ఒక భాష మాట్లాడే వాళ్లు ఉన్న దేశాల మధ్య గేమ్స్ జరిగితే...? అవి ‘లూసోఫోనియా గేమ్స్’. పోర్చుగీస్ భాష వాడుకలో ఉన్న దేశాల మధ్య జరిగే క్రీడలు లూసోఫోనియా క్రీడలు. (ఒక దేశంలో ఏదో ఒక ప్రాంతంలో ఆ భాష మాట్లాడే వారున్నా ఆ దేశం ఈ క్రీడల్లో పాల్గొనవచ్చు) ఈసారి ఈ క్రీడలకు భారతదేశం ఆతిథ్యం ఇస్తోంది. జనవరి 18 నుంచి 29 వరకు 11 అంశాల్లో ఈ ఆటలు గోవాలో జరుగుతాయి. ఎనిమిదేళ్ల క్రితం ప్రారంభం పోర్చుగీసు భాష మాట్లాడే దేశాల మధ్య క్రీడలు నిర్వహించాలనే ఆలోచన 2004లో వచ్చింది. చకచకా ఏర్పాట్లు జరిగాయి. 2006లో మకావులో తొలిసారి ఈ క్రీడలు నిర్వహించారు. మకావులో జరిగిన ఈ ఈవెంట్లో 11 దేశాలకు చెందిన 733 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. లిస్బన్ వేదికగా జరిగిన 2009 క్రీడల్లో 12 దేశాల నుంచి 1300 మంది బరిలోకి దిగారు. భారత్‌తోపాటు బ్రెజిల్, అంగోలా, కేప్‌వర్డె, ఈస్ట్ తిమోర్, గినియా బిసావూ, మొజాంబిక్, పోర్చుగల్, సావోతోమి ప్రిన్సిపి, ఈక్వటోరియల్ గినియా, ఘనా, ఫ్లోరెస్, మారిషస్, మొరాకో దేశాలు ఈ క్రీడల్లో పోటీపడుతున్నాయి. మళ్లీ ఇప్పుడు 2014లో భారత్‌లో ఈ క్రీడలు జరుగుతున్నాయి. బ్రెజిల్ టాప్... గత రెండు ఈవెంట్స్‌లో బ్రెజిల్ పతకాల పట్టికలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. బ్రెజిల్ సాధించిన మొత్తం 133 పతకాల్లో స్వర్ణాలు 62... రజతాలు 42... కాంస్యాలు 29 ఉన్నాయి. భారత్ మాత్రం ఒక స్వర్ణం, రెండు రజతాలు, ఏడు కాంస్యాలతో కలిపి మొత్తం పది పతకాలు సాధించింది. -
ఆ గేమ్స్ మాకొద్దు:స్వాతంత్ర్య సమరయోధులు
పనాజీ: అంతర్జాతీయంగా ఆదరణ కల్గిన గేమ్స్ ఏ వేదికపై జరిగినా ప్రజలు, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చి కొండత అండగా నిలుస్తూ ఉండటం మనకు బాగా తెలిసిన విషయం. కాగా, గోవా రాష్ట్రంలో జరప తలపెట్టిన లూసోఫోనియా గేమ్స్ ను మాత్రం అక్కడి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం లూసోఫోనియా గేమ్స్ గుర్తింపు పొందిన ఈ గేమ్సను .. గతంలో పోర్చ్ గీసు కామన్ వెల్త్ గేమ్స్ గా వ్యవహరించేవారు. గతంలో పోర్చుగీసు వారి ఆధిపత్యం చలాయించడంతో రాష్ట్ర ప్రజలు ఇప్పటికీ దుర్భరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారని గోవా స్వాతంత్ర్య సమరయోధుల అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రకాంత్ కంక్రే అభిప్రాయపడ్డారు. ఆ గేమ్స్ ఇక్కడ నిర్వహించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఆ దేశానికి సంబంధించిన లూసోఫోనియా గేమ్స్ ఇక్కడ ఎలా నిర్వహించాలనుకుంటున్నారని మండిపడ్డారు. గోవాను 450 సంవత్సరాలు పోర్చుగీసు వాసులు పరిపాలించారంటూ ఆక్కడి ప్రజలు అపహాస్యం చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీనికి సంబంధించి నవంబర్ లో జరిగే ఈ గేమ్స్ లో పాల్గొనకూడదని ఆ రాష్ట్ర ఆటగాళ్లకు ఆయన ఒక విజ్ఞాపన పత్రాన్ని పంపారు. కాగా గోవా ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గురుదత్త్ భక్తా మాత్రం దీన్ని ఖండించారు. ఒలింపిక్స్ క్రీడలు యథావిదిగా జరుగుతాయన్నారు.