
ఫీల్డర్ల దృష్టి మళ్లించి ఆడా: మ్యాక్స్‌వెల్
అదృష్టానికి తోడు, ఫీల్డర్ల దృష్టి మళ్లించడం వల్లే తాను భారీ ఇన్నింగ్స్ ఆడగలిగానని పంజాబ్ కింగ్స్ ఎలెవన్ స్టార్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ తెలిపాడు.
షార్జా: అదృష్టానికి తోడు, ఫీల్డర్ల దృష్టి మళ్లించడం వల్లే తాను భారీ ఇన్నింగ్స్ ఆడగలిగానని పంజాబ్ కింగ్స్ ఎలెవన్ స్టార్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ తెలిపాడు. తన నుంచి వరుసగా రెండు భారీ ఇన్నింగ్స్ ఎవరూ ఆశించి ఉండరని అన్నారు. అయితే కొద్దిగా అదృష్టం కలిసిరావడంతో భారీ స్కోరు సాధ్యమయిందని తెలిపాడు. అదృష్టం తన వెంటే ఉంటే మరికొన్ని భారీ ఇన్నింగ్స్ ఆడతానని ఆశాభావం వ్యక్తం చేశాడు. బౌండరీని లక్ష్యంగా చేసుకుని ఫీల్డర్ల దృష్టి మళ్లించానని చెప్పాడు. లక్ష్య ఛేదనలో ఉండే ఒత్తిడిని భారీ ఇన్నింగ్స్ తో అదిగమించానని ఈ ఆల్ రౌండర్ తెలిపాడు.
ఐపీఎల్-7లో తానాడిన రెండు మ్యాచ్ ల్లో మ్యాక్స్‌వెల్ సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. లక్ష్య ఛేదనలోనే ఈ రెండు ఇన్నింగ్స్ ఆడడం విశేషం. చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్ లో 45 బంతుల్లో 95 పరుగులు చేశాడు. రాజస్థాన్ పై ఆడిన రెండో మ్యాచ్ లోనూ మ్యాక్స్‌వెల్ విజృంభించాడు. 45 బంతుల్లో 89 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.