'ఆయా క్రీడల్ని నిషేధించడం సబబే' | Former S African cricket supremo backs ban by sports minister | Sakshi
Sakshi News home page

'ఆయా క్రీడల్ని నిషేధించడం సబబే'

Apr 26 2016 7:21 PM | Updated on Sep 3 2017 10:49 PM

'ఆయా క్రీడల్ని నిషేధించడం సబబే'

'ఆయా క్రీడల్ని నిషేధించడం సబబే'

వర్ణవివక్ష కారణంగా దక్షిణాఫ్రికాలో పలు క్రీడలను సంవత్సరం పాటు నిషేధించటాన్ని ఆ దేశ దిగ్గజ క్రికెటర్ ఆలీ బాచర్ సమర్ధించాడు.

జోహనెస్బర్గ్: వర్ణవివక్ష కారణంగా దక్షిణాఫ్రికాలో పలు క్రీడలను సంవత్సరం పాటు నిషేధించటాన్ని ఆ దేశ దిగ్గజ క్రికెటర్ ఆలీ బాచర్ సమర్ధించాడు. దక్షిణాఫ్రికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆయా బోర్డులకు ఒక గుణపాఠమని పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికా జాతీయ జట్టులో నల్ల జాతి క్రీడాకారులు 60 శాతం మంది ఉండాలనే నిబంధనను విస్మరించడం ఎంతమాత్రం సమంజసం కాదన్నాడు. గతంలో ఇలా వర్ణ వివక్షకు గురై కొంతకాలం క్రికెట్ జీవితానికి దూరంగా ఉండాల్సి వచ్చిన బాచర్..  ఆయా క్రీడా సమాఖ్యలను  ప్రభుత్వం ఎప్పట్నంచో  హెచ్చరిస్తున్నా వారు విస్మరిస్తూ రావడం బాధాకరమన్నారు. ఇకనైనా దక్షిణాఫ్రికాలో మార్పులు రాకపోతే ప్రభుత్వ జోక్యం ఇదే తరహాలో  ఉంటుందని ఆశిస్తున్నట్లు ఆలీ బాచర్ అన్నారు.

దక్షిణాఫ్రికాలో అంతర్జాతీయ క్రికెట్‌, రగ్బీ మ్యాచులు నిర్వహించకుండా ఆ దేశ ప్రభుత్వం దాదాపు ఏడాదిపాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. క్రికెట్‌, రగ్బీ ఆటల్లో నల్లజాతీయులను విస్మరించి.. కేవలం శ్వేతజాతీయులకు మాత్రమే అవకాశమిస్తుండటంతో దక్షిణాఫ్రికా క్రీడామంత్రి ఫికిలి ఎంబాలులా సోమవారం ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ టోర్నమెంట్లు నిర్వహించకుండా జాతీయ రగ్బీ, క్రికెట్‌ ఫెడరేషన్లపై ఆయన నిషేధం విధించారు. రగ్బీ, క్రికెట్, ఫుట్‌బాల్, అథ్లెటిక్స్‌, నెట్‌బాల్‌.. మొత్తం ఐదు క్రీడలకు ఈ నిషేధం వర్తించనుందని ఆయన తెలిపారు. నల్లజాతీయులను ప్రోత్సహించడంలో ఒక్క ఫుట్‌బాల్ క్రీడ మాత్రమే ముందున్నదని, కాబట్టి ఫుట్‌బాల్‌కు ఈ నిషేధం వర్తించబోదని ఆయన తెలిపారు.వచ్చే ఏడాది దీనిపై సమీక్ష ఉంటుందన్నారు. దక్షిణాఫ్రికా ప్రభుత్వం నిర్ణయం వల్ల 2023 రగ్బీ వరల్డ్‌ కప్‌ నిర్వహణకు బిడ్డింగ్‌ దాఖలుచేసే అవకాశాన్ని ఆ దేశ బోర్డు కోల్పోనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement