రాణించిన ఫర్హాన్, ఫరాజ్ | farahan,faraj sucessful | Sakshi
Sakshi News home page

రాణించిన ఫర్హాన్, ఫరాజ్

Nov 27 2013 11:49 PM | Updated on Sep 2 2017 1:02 AM

బ్యాట్స్‌మన్ ఫర్హాన్ (142), బౌలింగ్‌లో ఫరాజ్ (7/70) రాణించడంతో పాషా బీడీ జట్టు విజయం సాధించింది.

జింఖానా, న్యూస్‌లైన్: బ్యాట్స్‌మన్ ఫర్హాన్ (142), బౌలింగ్‌లో ఫరాజ్ (7/70) రాణించడంతో పాషా బీడీ జట్టు విజయం సాధించింది. ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్‌లో భాగంగా బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో 89 పరుగుల తేడాతో ఆక్స్‌ఫర్డ్ బ్లూస్ జట్టుపై పాషా బీడీ నెగ్గింది. తొలి రోజు పాషా బీడీ 425 పరుగుల వద్ద ఆలౌటైంది.
 
 ముజ్తాబా (62) అర్ధ సెంచరీతో రాణించాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆక్స్‌ఫర్డ్ బ్లూస్ 334 పరుగుల వద్ద కుప్పకూలింది. రోహిత్ భరద్వాజ్ (127) సెంచరీ చేసినా ఫలితం దక్కలేదు. దీపాంకర్ 36, అమిత్ సింగ్ 31 పరుగులు చేశారు. మరో మ్యాచ్‌లో బడ్డింగ్ స్టార్స్ జట్టు వికెట్ తేడాతో సిండికేట్ బ్యాంక్ జట్టుపై గెలుపొందింది.
 
 మొదట బ్యాటింగ్ చేసిన సిండికేట్ బ్యాంక్ 226 పరుగులకు ఆలౌట్ అయ్యింది. తర్వాత బరిలోకి దిగిన బడ్డింగ్ స్టార్స్ 9 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. నిఖిల్ (60) అర్ధ సెంచరీతో రాణించగా... యాదవ్ 45 పరుగుల చేసి ఫర్వాలేదనిపించాడు. సిండికేట్ బ్యాంక్ బౌలర్లు జయానంద్ 5, శ్రీనివాస్ 3 వికెట్లు పడగొట్టారు.
 
 ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
 ఠ గుజరాతీ ఎలెవన్: 110 (చాంద్ పాషా 5/57, ప్రవీత్ 4/23); ఎస్‌ఏ అంబర్‌పేట్: 112/2 (యాసిన్ 76).
 
 బ్రదర్ జాన్ ఆఫ్ గాడ్ అండర్-16 టోర్నీ
 ఠ గౌతమ్ మోడల్ స్కూల్: 210/5 (వరుణ్ గౌడ్ 100 నాటౌట్, సాగర్ చౌరాసియా 30); బోస్టన్ మిషన్ హైస్కూల్: 101 (జైదేవ్ గౌడ్ 6/28).
 
 అంతర్ జిల్లా అండర్-16 ఫైనల్స్
 ఠ మెదక్: 99 (శ్రవణ్ కుమార్ 3/16, గిరీశ్ గౌడ్ 3/26, అనికేత్ రెడ్డి 3/26); నిజామాబాద్: 100/3 (సాత్యకి 44 నాటౌట్).
 

Advertisement
 
Advertisement
Advertisement