బొటాస్‌కు పోల్‌ పొజిషన్‌  | F1 2019: VALTTERI BOTTAS TAKES CHINESE GP POLE POSITION | Sakshi
Sakshi News home page

బొటాస్‌కు పోల్‌ పొజిషన్‌ 

Apr 14 2019 3:28 AM | Updated on Apr 14 2019 3:28 AM

F1 2019: VALTTERI BOTTAS TAKES CHINESE GP POLE POSITION - Sakshi

షాంఘై: ఫార్ములావన్‌ సీజన్‌లోని మూడో రేసు చైనా గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్‌ జట్టు డ్రైవర్‌ వాల్తెరి బొటాస్‌ ‘పోల్‌ పొజిషన్‌’ సాధించాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్‌ సెషన్‌లో బొటాస్‌ అందరికంటే వేగంగా ఒక నిమిషం 31.547 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు.

ఆదివారం జరిగే ప్రధాన రేసును బొటాస్‌ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. మెర్సిడెస్‌కే చెందిన లూయిస్‌ హామిల్టన్‌ రెండో స్థానం నుంచి... వెటెల్‌ (ఫెరారీ) మూడో స్థానం నుంచి రేసును ఆరంభిస్తారు. ఫార్ములావన్‌లో నేడు జరిగే చైనా గ్రాండ్‌ప్రి 1000వ రేసు కానుండటం విశేషం. 
 

Advertisement
 
Advertisement
Advertisement