ఆలిండియా ఎఫ్‌సీఐ టోర్నీకి సౌత్‌జోన్‌ జట్టు | Ephsiai sautjon team to the tournament in India | Sakshi
Sakshi News home page

ఆలిండియా ఎఫ్‌సీఐ టోర్నీకి సౌత్‌జోన్‌ జట్టు

Jan 14 2017 1:04 AM | Updated on Sep 5 2017 1:11 AM

ఆలిండియా ఎఫ్‌సీఐ టోర్నీకి సౌత్‌జోన్‌ జట్టు

ఆలిండియా ఎఫ్‌సీఐ టోర్నీకి సౌత్‌జోన్‌ జట్టు

భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) అఖిల భారత ఇంటర్‌ జోనల్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో పాల్గొనే సౌత్‌జోన్‌ జట్టును ప్రకటించారు.

హైదరాబాద్‌: భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) అఖిల భారత ఇంటర్‌ జోనల్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో పాల్గొనే సౌత్‌జోన్‌ జట్టును ప్రకటించారు. ఈనెల 4 నుంచి సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానంలో సౌత్‌జోన్‌లోని వివిధ రీజియన్ల నుంచి 29 మంది ప్రాబబుల్స్‌కు సెలెక్షన్‌ ట్రయల్స్‌ నిర్వహించారు. హైదరాబాద్‌ రీజినల్‌ స్పోర్ట్స్‌ ప్రమోషన్‌ కమిటీ (ఆర్‌ఎస్‌పీసీ) అధ్యక్షుడు, జనరల్‌ మేనేజర్‌ ఎ.రాజగోపాల్, ఆర్‌ఎస్‌పీసీ సెక్రటరీ, పీఆర్‌ డీజీఎం విక్టర్‌ అమల్‌రాజ్‌ ఈ ట్రయల్స్‌ను పర్యవేక్షించారు. ట్రయల్స్‌లో కనబరిచిన ప్రదర్శన ఆధారంగా ఆలిండియా ఎఫ్‌సీఐ టోర్నీలో పాల్గొనే 16 మంది సభ్యులతో కూడిన సౌత్‌జోన్‌ జట్టును ప్రకటించారు. ఈ జట్టుకు డీఎస్‌ శ్రీధర్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఆలిండియా ఎఫ్‌సీఐ టోర్నీ చండీగఢ్‌లో ఈనెల 16 నుంచి 20 వరకు జరుగుతుంది.

సౌత్‌జోన్‌ ఎఫ్‌సీఐ జట్టు: డి.ఎస్‌. శ్రీధర్‌ (కెప్టెన్‌), సుమిత్‌ అహ్లావత్, వై. అముల్‌ పాల్, కె.శ్రీకాంత్, ఎ.సెంథిల్‌ కుమారన్, జి.శ్రీకాంత్, ప్రవీణ్‌ సోనీ, ఎస్‌.గంగాధరన్, నవీన్‌ నైన్, జి.బాలకుమార్, ప్రమోద్‌ కుమార్, ఎస్‌.యోగేశ్, ఎం.ఎ.రషీద్, జె.ఆర్‌.శ్రీనివాస్, వెంకటేశ్‌ సాగర్, హెచ్‌.చంద్ర శేఖర్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement