మ్యాచ్‌ టర్నింగ్‌ పాయింట్‌ ఇదే.. | Eng vs Ind - Turning Point - Punam Raut Dismissal | Sakshi
Sakshi News home page

మ్యాచ్‌ టర్నింగ్‌ పాయింట్‌ ఇదే..

Jul 24 2017 9:19 AM | Updated on Sep 5 2017 4:47 PM

మ్యాచ్‌ టర్నింగ్‌ పాయింట్‌ ఇదే..

మ్యాచ్‌ టర్నింగ్‌ పాయింట్‌ ఇదే..

మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత మహిళల ఓటమికి ప్రధాన కారణం ఒత్తిడిని అధగమించకపోవడం.

లార్డ్స్‌: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత మహిళల ఓటమికి ప్రధాన కారణం ఒత్తిడిని అధిగమించకపోవడం. ఈ విషయాన్ని కెప్టెన్‌ మిథాలే అంగీకరించింది. 28 పరుగుల వ్యవధిలో చివరి 7 వికెట్లు కోల్పోయి 9 పరుగుల స్వల్ప తేడాతో టీమిండియా పరాజయం పొందింది. ఇక మ్యాచ్‌కు టర్నింగ్‌ పాయింట్‌ ఓపెనర్‌ పూనమ్‌ రౌత్‌ వికెట్‌.. 191/3 పటిష్ట స్థితిలో ఉన్న భారత్‌ను ఇంగ్లండ్‌ బౌలర్‌ ష్రబ్‌సోల్‌ దెబ్బతీసింది. క్రీజులో పాతుకుపోయిన పూనమ్‌ రౌత్(86)ను 43 ఓవర్‌లో ష్రబ్‌సోల్‌ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌కు చేర్చింది.

అనంతరం క్రీజులోకి వచ్చిన బ్యాట్స్‌ఉమెన్‌  సుష్మావర్మ పరుగులేమి చేయకుండా వెనుదిరగడంతో భారత బ్యాట్స్‌ ఉమెన్‌లపై ఒత్తిడి పెరిగింది. అయినా వేద కృష్ణమూర్తి(35)  క్రీజులో ఉండటం.. దాటిగా బ్యాటింగ్‌ చేయగల దీప్తి శర్మ బ్యాటింగ్‌ రావడం.. భారత్‌ గెలుస్తోందని అందరూ భావించారు. కానీ వేద అనవసర షాట్‌కు ప్రయత్నించి భారీ మూల్యం చెల్లించుకుంది. దీంతో మ్యాచ్‌ ప్తూర్తిగా ఇంగ్లండ్‌ వశం అయింది. చివర్లో శిఖా పాండే, దీప్తీ కుదురుగా ఆడినట్లు కనిపించినా అది ఎంత సేపు కొనసాగలేదు. పాండే అనవసర పరుగుకోసం ప్రయత్నించి రనౌట్‌ అయింది.  థర్డ్‌ డౌన్‌లో వచ్చే దీప్తీ శర్మను చివర్లో బ్యాటింగ్‌ పంపడం కూడా భారత్‌ను కొంపముంచింది.

బెడిసి కొట్టిన భారత్‌ ముందు జాగ్రత్త..
కేవలం విజయానికి 38 పరుగులే కావల్సిన సందర్భంలో దీప్తీని బ్యాటింగ్‌ పంపించకుండా సుష్మా వర్మ బ్యాటింగ్‌ రావడం భారత్‌ను కొంప ముంచింది. పూనమ్‌ రౌత్‌ వికెట్‌ అనంతరం దీప్తీ బ్యాటింగ్‌ వస్తే ఎలాంటి ఒత్తిడి ఉండేది కాదు. అది కాకుండా బ్యాటింగ్‌కు వచ్చిన సుష్మావర్మ డకౌట్‌ అవడంతో ఒత్తిడి మరింత పెరిగింది. దీంతో చివర్లో దీప్తీ ఆదుకుంటుందనే భారత్‌ వ్యూహం.. బెడిసి కొట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement