ద్యుతీచంద్‌కు స్వర్ణం | Dutee Chand wins gold medal | Sakshi
Sakshi News home page

ద్యుతీచంద్‌కు స్వర్ణం

Jun 30 2018 10:19 AM | Updated on Jun 30 2018 10:19 AM

Dutee Chand wins gold medal - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అథ్లెటిక్స్‌ కోచ్‌ నాగపురి రమేశ్‌ శిష్యురాలు ద్యుతీచంద్‌ మహిళల 100 మీటర్ల విభాగంలో సరికొత్త జాతీయ రికార్డు నెలకొల్పింది. గువాహటిలో జరుగుతున్న జాతీయ అంతర్‌ రాష్ట్ర అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో ఆమె సెమీఫైనల్‌ రేసును 11.29 సెకన్లలో గమ్యానికి చేరింది. 11.30 సెకన్లతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును తిరగరాసింది.

ఫైనల్లో ద్యుతీచంద్‌ 11.32 సెకన్లలో రేసును ముగించి అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. అంతేకాకుండా ఆసియా క్రీడలకు కూడా అర్హత సాధించింది.  

Advertisement
 
Advertisement
Advertisement