2014 సీజన్‌ పునరావృతం చేస్తాం:సాహా | Dressing room atmosphere secret to KXIP's good start, says Saha | Sakshi
Sakshi News home page

2014 సీజన్‌ పునరావృతం చేస్తాం:సాహా

Apr 12 2017 7:33 PM | Updated on Sep 5 2017 8:36 AM

2014 సీజన్‌ పునరావృతం చేస్తాం:సాహా

2014 సీజన్‌ పునరావృతం చేస్తాం:సాహా

విజయాలకు కారణం డ్రెస్సింగ్‌రూం వాతవరణమే కారణమని పంజాబ్‌ వికెట్‌ కీపర్‌

కొల్‌కతా: గత సీజన్‌లో చతికిలపడి పాయింట్ల పట్టికలో చివరి స్ధానంలో నిలిచిన కింగ్స్‌ పంజాబ్‌ జట్టు ఈ సీజన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ విజయాలకు కారణం డ్రెస్సింగ్‌రూం వాతవరణమే కారణమని పంజాబ్‌ వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా అభిప్రాయపడ్డాడు. అంతే కాకుండా ఇది 2014 సీజన్‌లా కొనసాగుతుందన్నాడు. 2014 సీజన్‌ ఫైనల్లో కొల్‌కతా నైట్‌రైడర్స్‌తో  ఓడి పంజాబ్‌ రన్నరప్‌గా నిలిచింది. అప్పుడున్న వాతవరణమే ఇప్పుడుందని సాహా పేర్కొన్నాడు.
 
ఈ సీజన్‌లో కూడా ఫైనల్‌కు చేరుతామని ఆశాభావం వ్యక్తం చేశాడు. లోక్‌ సభ ఎన్నికల నేపథ్యంలో దుబాయ్‌లో జరిగిన ఆ సీజన్‌లో పంజాబ్‌ 5 విజయాలు నమోదు చేసిందని గుర్తు చేశాడు. వీరేంద్ర సెహ్వాగ్‌ సూచనలు మాకు ప్రయోజనమయ్యాయని, ఇప్పటికే జరిగిన మ్యాచ్‌ల్లో అవి కనపడ్డాయని సాహా పేర్కొన్నాడు. ప్రత్యర్ధి జట్టుకు పరుగులివ్వకుండా కట్టడి చేస్తున్నామని ఇది జట్టుకు లాభదాయకమని సాహా పేర్కొన్నాడు. మా జట్టులో ఎలాంటి బ్యాటింగ్‌ ఆర్డర్‌ లేదని, పరిస్ధితులను బట్టి బ్యాట్స్‌మన్‌లు క్రీజులోకి వస్తారన్నాడు. మాక్స్‌వెల్‌ మంచి దూకుడైన ఆటగాడని ఈ విషయంలో ఎలాంటి సందేహాం లేదని సాహా తెలిపాడు. రేపు జరిగే కొల్‌కతా మ్యాచ్‌లో కూడా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. మా బౌలింగ్‌, బ్యాటింగ్‌ లైనప్‌, పటిష్టంగా ఉందన్నాడు. కొల్‌కతా ముంబైతో ఓడిపోవడం, క్రిస్‌లీన్‌ గాయపడటం మాకు కలిసొచ్చె విషయమని సాహా వ్యాఖ్యానించాడు. పంజాబ్‌ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి హ్యాట్రిక్‌ విజయంపై కన్నేసింది. బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌పై 8 వికెట్ల తేడాతో, పుణే పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించి దూకుడు మీద ఉంది. ఈ రెండు మ్యాచ్‌లు చేజింగ్‌లోనే పంజాబ్‌ నెగ్గింది. గురువారం కొల్‌కతాతో ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగే మ్యాచ్‌ ఆసక్తికరంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement