‘టెక్సాస్’ ఫైనల్లో దీపిక | Dipika Pallikal packs off Perry to enter Texas Open final | Sakshi
Sakshi News home page

‘టెక్సాస్’ ఫైనల్లో దీపిక

Apr 14 2014 12:02 AM | Updated on Sep 2 2017 5:59 AM

‘టెక్సాస్’ ఫైనల్లో దీపిక

‘టెక్సాస్’ ఫైనల్లో దీపిక

భారత నంబర్‌వన్ స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పళ్లికల్ టెక్సాస్ ఓపెన్ టోర్నీలో ఫైనల్‌కు చేరుకుంది.

హౌస్టన్ (అమెరికా): భారత నంబర్‌వన్ స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పళ్లికల్ టెక్సాస్ ఓపెన్ టోర్నీలో ఫైనల్‌కు చేరుకుంది. సెమీఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్ దీపిక 11-7, 11-13, 13-11, 10-12, 11-4 తేడాతో 8వ ర్యాంకర్ మెడలిన్ పెర్రీ (ఐర్లాండ్)పై సంచలన విజయం సాధించింది. దీంతో 22 ఏళ్ల దీపిక తన కెరీర్‌లోనే అతిపెద్ద టోర్నీ (రూ.30 లక్షల ప్రైజ్‌మనీ)లో టైటిల్ పోరుకు చేరుకుంది.

 

అంతేగాక పెర్రీతో ముఖాముఖి రికార్డునూ 2-2తో సమం చేసింది. ఇక ఫైనల్లో నయా సంచలనం నౌర్ ఎల్ షెర్బిని (ఈజిప్టు)తో దీపిక తలపడనుంది. క్వాలిఫయర్‌గా టోర్నీ బరిలోకి దిగి సంచలన విజయాలు సాధించిన షెర్బిని సెమీప్‌లో ప్రపంచ నంబర్‌వన్ నికోల్ డేవిడ్ (మలేసియా)కు షాకిచ్చి ఫైనల్‌కు దూసుకెళ్లింది.

Advertisement
 
Advertisement
Advertisement