'క్రికెటర్లకు దావూద్ ఇబ్రహీం సినీ తారలను ఎరవేసేవాడు' | Dilip Vengsarkar reveal Dawood Ibrahim visited Indian dressing room in 1987 match | Sakshi
Sakshi News home page

'క్రికెటర్లకు దావూద్ ఇబ్రహీం సినీ తారలను ఎరవేసేవాడు'

Oct 28 2013 6:06 PM | Updated on Sep 2 2017 12:04 AM

మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంపై భారత్ మాజీ కెప్టెన్ వెంగసర్కార్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ముంబై:మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంపై భారత్ మాజీ కెప్టెన్ వెంగసర్కార్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్ క్రికెట్ టీమ్ లోకి సినీ తారలను ఎరవేసి ఫిక్సింగ్ కార్యక్రమాలకు పాల్పడే వాడని వెంగీ విరుచుకుపడ్డాడు. భారత్ డ్రెస్సింగ్ రూంలోకి దావూద్ ఇబ్రహీం నేరుగా ప్రవేశించేవాడని ఆరోపణలు గుప్పించాడు. 1986లోనే భారత్ క్రికెట్ జట్టుతో సంబంధాలు సాగించేవాడని వెంగీ తెలిపాడు. మాఫియా అనేది భారత్ క్రికెట్ లోకి ప్రవేశించి రెండు దశాబ్దాలుగా పైనే అయ్యిందని విమర్శలు గుప్పించాడు. షార్జా కప్ ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ పై గెలిస్తే  ఒక్కొఆటగాడికి టోయోటా కారుగిఫ్ట్‌గా ఇస్తానని జట్టు సభ్యులకు వలవేసాడని వెంగీ తెలిపాడు. కాగా, ఈ వ్యాఖ్యలను కపిల్ దేవ్ ఖండించాడు.
 

దావూద్ ఇబ్రహీంకు అల్ఖైదాతో కూడా సంబంధాలున్నట్లు తెలియడంతో అతను ప్రపంచవ్యాప్తంగా “మోస్ట్ వాంటెడ్”గా గుర్తించిన సంగతి తెలిసిందే. తాజాగా దావూద్ పై వెంగీ విమర్శలు గుప్పించడంతో క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement