తండ్రికి తగ్గ తనయ, ఏం చేసిందో చూశారా? | Dhoni, Ziva Busy Using Their Respective Gadgets Will Melt Your Heart | Sakshi
Sakshi News home page

తండ్రికి తగ్గ తనయ, ఏం చేసిందో చూశారా?

Aug 16 2018 12:29 PM | Updated on Aug 16 2018 4:04 PM

Dhoni, Ziva Busy Using Their Respective Gadgets Will Melt Your Heart - Sakshi

కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోని ముద్దుల కుమార్తె జీవా ధోని ఇప్పటికే సోషల్‌మీడియాలో ఓ సెన్సెషన్. జీవా పలు సార్లు తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంది. క్యూట్‌ క్యూట్‌గా డ్యాన్స్‌లు వేయడం, తండ్రి మ్యాచ్‌ మధ్యలో అలసిపోతే మంచినీళ్లు తీసుకెళ్లి ఇవ్వడం, ధోనితో పాటు గ్రౌండ్‌లో డ్యాన్స్‌లు వేయడం వంటివి చేస్తూ... జీవా ధోని నెటిజన్లను ఫిదా చేస్తోంది. తాజాగా తండ్రికూతుర్ల ఓ క్యూటెస్ట్‌ పిక్చర్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిలో కూడా జీవా.. మరోసారి తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంది.  ధోని, కూతురు జీవా ఇద్దరూ కూడా తమ తమ గాడ్జెట్లలో మునిగిపోయిన పిక్చర్‌ అది. 

ఓ హోటల్‌లో కూర్చుని ఉన్న వీరిద్దరూ.. చుట్టుపక్కల పరిసరాలన్నింటిన్నీ పట్టించుకోకుండా గాడ్జెట్లకు అతుకుపోయారు. ధోని తన ఐప్యాడ్‌ను వాడుతుండగా.. ఈ బుల్లి జీవా కూడా తన చిన్న ఐప్యాడ్‌ను తీసుకుని ఎంతో శ్రద్ధగా గమనిస్తూ కనిపించింది. ఈ పిక్చర్‌లో ధోని తన ట్రైనింగ్‌ జెర్సీ వేసుకుని కనిపించాడు. అంటే ఈ పిక్చర్‌ ఇటీవల సిరీస్‌ మ్యాచ్‌ల సమయంలో తీసిందేనని తెలిసింది. వారి టేబుల్‌పై టీ కప్పులు, సూప్‌ బౌల్స్‌ వంటివి ఉన్నాయి. ట్విటర్‌లో షేర్‌ అయిన ఈ పిక్చర్‌ ఇప్పుడు సోషల్‌ మీడియా యూజర్ల హృదయాలను కొల్లగొడుతోంది.ఇటీవల కేంద్ర మాజీ మంత్రి ప్రఫుల్‌ పటేల్‌ కుమార్తె పూర్ణ పటేల్‌ వివాహంలో కూడా జీవా తన డ్యాన్స్‌తో నెటిజన్లను ఫిదా చేసింది. ముద్దుముద్దుగా జీవా వేసిన స్టెపులపై అభిమానులు పొగడ్తల వర్షం కురిపించారు. గ‌తంలో కూడా జీవాకి సంబంధించిన వీడియోలని ధోని, సాక్షిలు ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేయ‌డం, అవి కొద్ది నిమిషాల‌లోనే వైర‌ల్‌గా మారడం సంగ‌తి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement