
ఎంఎస్ ధోని(ఫైల్‌ఫొటో)
రాంచీ: టీమిండియా కాంట్రాక్ట్‌లో చోటు కోల్పోయిన రోజే ఎంఎస్ ధోని మైదానంలోకి దిగడం విశేషం. తన స్వస్థలం రాంచీలో జార్ఖండ్ జట్టు రంజీ జట్టు సభ్యులతో కలిసి అతను ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. ఒకవైపు ధోనిని కాంట్రాక్ట్ జాబితా నుంచి తొలగిస్తే, మరొకవైపు అతను బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చాడు. బ్యాటింగ్‌తో పాటు రెగ్యులర్ ట్రైనింగ్‌లో కూడా అతను భాగమైనట్లు జార్ఖండ్ టీమ్ మేనేజ్‌మెంట్ వెల్లడించింది. ప్రత్యేక బౌలింగ్ మెషీన్ ద్వారా అతను సాధన చేయడం విశేషం. రంజీ ఆటగాళ్లంతా ఎర్రబంతితో ప్రాక్టీస్ చేస్తే ధోని మాత్రం తెల్ల బంతితో ఆడాడు.
తద్వారా పోటీ క్రికెట్ కోసం తాను సిద్ధమవుతున్నట్లు ధోని పరోక్షంగా చూ పించాడు. ఐపీఎల్‌తోనే ధోని రీఎంట్రీ షురూ కావొచ్చు. బీసీసీఐ ప్రకటించిన కాంట్రాక్టులో ధోనికి చోటుదక్కలేదన్న విషయం తెలిసిందే. గతేడాది ఎ-గ్రేడ్ కాంట్రాక్ట్‌లో ఉన్న ఈ మిస్టర్ కూల్‌కు ఈసారి ఎలాంటి గ్రేడ్ దక్కలేదు. దీంతో అతని కెరీర్ ముగిసినట్లేనని మాజీ క్రికెటర్లు జోస్యం చెబుతున్నారు. ఈ కాంట్రాక్టుల వ్యవహారం ధోని అభిమానులను నిరాశపరిచినా.. అతను మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టడం.. ప్రాక్టీస్ పాల్గోనడం మాత్రం ఫ్యాన్స్‌లో జోష్‌ను నింపుతుంది.