ధోని దేశభక్తి!

Dhoni has once again showing patriotism to the world - Sakshi

దేశం తరఫున ఆడుతున్నప్పుడు మైదానంలో ధోని అంకితభావం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు మ్యాచ్‌లో జరిగిన ఒక ఘటన ధోని దేశభక్తిని మరోసారి ప్రపంచానికి చూపించింది. కివీస్‌ ఇన్నింగ్స్‌ సమయంలో ఒక అభిమాని భద్రతను ఛేదించుకొని గ్రౌండ్‌లోకి దూసుకొచ్చాడు. అతను నేరుగా ధోని వద్దకు వెళ్లి పాదాభివందనం చేశాడు.

ఈ క్రమంలో అతని చేతిలో ఉన్న మన జాతీయ జెండా నేలను తాకింది. అంతే... అమిత వేగంతో కిందకు వంగిన ధోని ముందుగా మువ్వన్నెల జెండాను తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ తర్వాతే సదరు అభిమానిని పక్కకు జరిపాడు. త్రివర్ణ పతాకాన్ని నేలకు తగలకుండా ‘లెఫ్ట్‌నెంట్‌ కల్నల్‌’ ధోని దానిపై తన గౌరవాన్ని ప్రదర్శించడం అందరినీ ఆకట్టుకుంది. ఆ క్షణం మ్యాచ్‌లో ‘మూమెంట్‌ ఆఫ్‌ ద డే’గా నిలిచింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top