ఢిల్లీ, తెలుగు టైటాన్స్ మ్యాచ్ టై | delhi and telugu titans match resulted as tie | Sakshi
Sakshi News home page

ఢిల్లీ, తెలుగు టైటాన్స్ మ్యాచ్ టై

Aug 11 2015 10:33 PM | Updated on Sep 3 2017 7:14 AM

ఢిల్లీ, తెలుగు టైటాన్స్ మ్యాచ్ టై

ఢిల్లీ, తెలుగు టైటాన్స్ మ్యాచ్ టై

ప్రొ కబడ్డీ లీగ్-2 లో భాగంగా చివరి వరకూ ఉత్యంఠభరితంగా సాగిన దబాంగ్ ఢిల్లీ, తెలుగు టైటాన్స్ టై అయింది.

న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్-2 లో భాగంగా చివరి వరకూ ఉత్యంఠభరితంగా సాగిన దబాంగ్ ఢిల్లీ, తెలుగు టైటాన్స్ టై అయింది. మంగళవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్లో ఇరు జట్లు 45-45 పాయింట్లే సాధించడంతో మ్యాచ్ టై అని అంపైర్లు ప్రకటించారు. తొలి అర్ధభాగంలో 20-18తో దబాంగ్ ఢిల్లీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. రెండో అర్ధభాగంలో అసలుసిసలు పోరు ప్రారంభమైంది. ఇరు జట్లు పోటాపోటీగా పాయింట్లు గెలుస్తుండటంతో మ్యాచ్ ఎవరు గెలుస్తారోనని ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది.

చివరి సెకన్ వరకూ విజయం ఇరు జట్లను దోబూచులాడింది. మ్యాచ్ ఫలితమూ టైగా తేలింది. 12మ్యాచ్ లకు గానూ 7 మ్యాచ్లు గెలిచి, 3 మ్యాచ్లు టై చేసుకుని, 2 మ్యాచ్ల్లో ఓడింది. ముంబాయి జట్టుకు 45 పాయంట్లే ఉన్నప్పటికీ సాంకేతిక అంశాలతో రెండో స్థానంలో ఉంది. దబాంగ్ ఢిల్లీ 26 పాయింట్లతో 5వ స్థానంలో కొనసాగుతోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement