మమ్మల్ని క్షమించండి: కోహ్లి

Deeply sorry for RCBs forgettable IPL season, Virat Kohli - Sakshi

న్యూఢిల్లీ: ఇండియన్‌ ప‍్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) తాజా సీజన్‌ తమకు అత్యంత చేదు జ్ఞాపకాల్ని మిగిల్చిందని రాయల్‌ చాలెంజర్స్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు పేలవ ప్రదర్శనతో నాకౌట్‌కు చేరలేకపోయిన తమను అభిమానులు క్షమించాలని కోరాడు. ఇది తమకు ఒక గుణపాఠంగా మిగిలిపోతుందని కోహ్లి పేర్కొన్నాడు. ప్రస్తుత తప్పుల నుంచి రాటుదేలి వచ్చే సీజన్‌లో సత్తాచాటుతామనే ధీమా వ్యక్తం చేశాడు.

‘మేము పూర్తిస్థాయి ప‍్రదర్శన చేయలేకపోయాం. ఇది మాకు గర్వించే సీజన్‌ ఎంత మాత్రం కాదు. ఎప్పటికీ మరచిపోలేని చేదు జ్ఞాపకాల్ని మిగిల‍్చింది. మేము ఆడిన విధానం నన్ను చాలా బాధించింది. మాపై ఫ్యాన్స్‌ పెట్టుకున్న ఆశల్ని నిలబెట్టలేదు. అందుకు వారంతా మమ్మల్ని క్షమించాల్సి ఉంది. వచ్చే సీజన్‌లో మరింత ఎక్కువగా చెమటోడ్చి అభిమానుల్ని అలరిస్తామనే హామీ ఇస్తున్నా’ అని కోహ్లి తెలిపాడు. ఆర్సీబీ 14 మ్యాచ్‌ల్లో 6 మాత్రమే గెలిచి, 8 మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది. ఫలితంగా పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానానికి పరిమితమైంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top