ట్యాంపరింగ్‌ : వార్నర్‌, స్మిత్‌లపై వేటు

David Warner And Smith Banned for One Year By Cricket Australia - Sakshi

ఏడాది నిషేధం విధించిన క్రికెట్‌ ఆస్ట్రేలియా

బెన్‌క్రాఫ్ట్‌పై 9 నెలల నిషేధం

ఐపీఎల్‌లో ఆడటం కష్టమే

సిడ్నీ : అంతా అనుకున్నట్టే ట్యాంపరింగ్‌ వివాదంలో చిక్కుకున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌లపై క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) ఏడాది పాటు నిషేధం విధించింది. ఇక బాల్‌ ట్యాంపరింగ్‌కు యత్నించిన యువ ఆటగాడు కామెరాన్‌ బెన్‌ క్రాఫ్ట్‌పై 9 నెలల నిషేధం విదిస్తూ చర్యలు తీసుకోంది. ఈ నిషేధంపై సవాలు చేసేందుకు వారం గడవుచ్చింది. ట్యాంపరింగ్‌ పాపం ఈ ముగ్గురు ఆటగాళ్లదేనని ఇప్పటికే తేల్చిన క్రికెట్‌ ఆస్ట్రేలియా తాజాగా వారిపై చర్యలు తీసుకుంది.

ఇప్పటికే స్మిత్‌, వార్నర్‌లకు ఐపీఎల్‌ రాజస్థాన్‌ రాయల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంచైజీలు  కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలిగిస్తూ షాక్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. క్రికెట్‌ ఆస్ట్రేలియా తీసుకునే చర్యలపైనే స్మిత్, వార్నర్‌ల ఐపీఎల్‌ భవితవ్యం ఆధారపడి ఉందని గతంలో ఐపీఎల్‌ చైర్మన్‌ రాజీవ్‌ శుక్లా మీడియాకు తెలిపారు. బీసీసీఐతో సమాలోచన చేశాకే స్మిత్‌పై తమ నిర్ణయం వెలువరిస్తామని ప్రాంచైజీలు ప్రకటించాయి. ఇప్పుడు క్రికెట్‌ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేదం విధించడంతో ఈ ఆటగాళ్లు  ఐపీఎల్‌లోనూ అనుమతించరనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి బీసీసీఐ మాత్రం ఎలాంటి నిర్ణయం ప్రకటన చేయలేదు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top