యువీ, భజ్జీ.. సాయం చేయండి: మాజీ క్రికెటర్‌

 Danish Kaneria Appeals To Yuvraj And Harbhajan - Sakshi

మా దేశంలో మైనార్టీలకు మీ సాయం అవసరం

కరాచీ: కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తున్న దేశాలలో పాకిస్తాన్‌ కూడా ఉంది. అక్కడ ప్రజలు సైతం కరోనా దెబ్బకు విలవిల్లాడుతున్నారు. ప్రపంచమంతా లాక్‌డౌన్‌ అయిన నేపథ్యంలో  ఆకలి బాధ తీర్చుకోవడం కూడా కష్టమై పోయింది. కరోనా వైరస్‌ కారణంగా ప్రాణాలు పోవడం సంగతి అటుంచితే, ఆకలితో అల్లాడిపోయేవారు వేలల్లో ఉన్నారు. అది పాకిస్తాన్‌లో ఎక్కువగా ఉంది. దీనిలో భాగంగా ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న వారికి తన ఫౌండేషన్‌ ద్వారా సాయం చేయాలని పాక్‌ మాజీ సారథి షాహిద్‌ ఆఫ్రిది ముందుకొచ్చాడు. దీనిలో భాగంగా తన ఫౌండేషన్‌ ద్వారా మందులు, ఆహారం అందిస్తున్నాడు. (అతను హిందూ కాబట్టే వివక్ష : అక్తర్‌)

అయితే 'ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఒక్కరికి ఇది చాలా కఠినమైన సమయం. ముఖ్యంగా పేదవారు, రెక్కాడితే గాని డొక్కాడని వారి కష్టాలు చెప్పలేనివి. వారికి వీలైనంత సాయం చేద్దాం.  అఫ్రిదీ ఫౌండేషన్‌కు నా మద్దతు ఉంటుంది. కరోనాపై పోరాటంలో అతడి ఫౌండేషన్ చేస్తున్న కృషి అభినందనీయం. అఫ్రిది పౌండేషన్‌కు విరాళాలు ఇవ్వండి' అని యూవీ, భజ్జీ విజ్ఞప్తి చేశారు. ఇది కొంతమంది భారత అభిమానులకు నచ్చలేదు. దాంతో యువీ, భజ్జీలపై విమర్శలకు దిగారు మానవత్వం కంటే ఏది ఎక్కువ కాదని వీరిద్దరూ కౌంటర్‌ ఇవ్వడంతో ఒక వర్గం ఫ్యాన్స్‌ కాస్త శాంతించారు. 

పాక్‌లో మైనార్టీలకు మీ సాయం అవసరం
ఇప్పుడు తాజాగా మరో పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ డానేష్‌ కనేరియా కూడా యువరాజ్‌, హర్భజన్‌ల సింగ్‌ల సాయం కోరాడు. పాక్‌లో ఉన్న మైనార్టీలకు యువీ, భజ్జీలు సాయం చేయాలని విన్నవించాడు. మైనార్టీ అయిన కనేరియా..  ఇంతటి క్లిష్ట సమయంలో మా దేశంలోని మైనార్టీలకు యువీ, భజ్జీల సాయం అవసరం​ ఉందని పేర్కొన్నాడు. ఈ మేరకు ఒక వీడియో రూపంలో యువీ, భజ్జీల సాయాన్ని అభ్యర్థించాడు. హిందూ మతస్థుడైన కనేరియా.. పాక్‌ తరఫున ఆడే రోజుల్లో వివక్షకు గురయ్యాడు. ఈ విషయం ఇటీవల షోయబ్‌ అక్తర్‌ బయటపెట్టాడు.  తమ దేశ క్రికెటర్లు కనేరియాను చాలా చిన్నచూపు చూసేవారంటూ స్పష్టం​ చేశాడు. దీనిపై కనేరియా అవుననే సమాధానం ఇచ్చినా, అక్కడ మైనార్టీ కావడంతో దీన్ని పెద్ద విషయం చేయకుండా వదిలేశాడు. తనపై విధించిన సస్పెన్షన్‌ విషయంలో కూడా పీసీబీ న్యాయం చేయలేదని గతంలో కనేరియా పేర్కొన్నాడు. ఫిక్సింగ్‌కు  పాల్పడిన చాలామంది పాకిస్తాన్‌ క్రికెటర్లపై నిషేధం ఎత్తివేసిన పీసీబీ.. తాను మైనార్టీ కావడం వల్లే వివక్ష చూపిస్తుందన్నాడు.  
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

01-09-2021
Sep 01, 2021, 17:32 IST
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 56,155 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,186 మందికి కరోనా...
01-09-2021
Sep 01, 2021, 16:10 IST
యశవంతపుర: కరోనా నియంత్రణ కోసం కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలో గట్టి చర్యలు తీసుకున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య, వైద్యవిద్యా మంత్రి సుధాకర్‌...
01-09-2021
Sep 01, 2021, 03:46 IST
సాక్షి, అమరావతి: కరోనా వ్యాక్సినేషన్‌లో ఆంధ్ర ప్రదేశ్‌ మరో రికార్డు సొంతం చేసుకుంది. మూడు కోట్ల డోసుల మైలురాయిని అధిగమించి...
30-08-2021
Aug 30, 2021, 17:02 IST
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 41,173 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 878 మందికి కరోనా...
29-08-2021
Aug 29, 2021, 17:38 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,557 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 18 మంది కరోనా...
29-08-2021
Aug 29, 2021, 10:28 IST
ఢిల్లీ: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. తాజాగా 24 గంటల్లో కొత్తగా 45,083 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇది...
29-08-2021
Aug 29, 2021, 03:14 IST
సాక్షి, అమరావతి: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా.. కోవిడ్‌ వైరస్‌...
28-08-2021
Aug 28, 2021, 11:41 IST
ఢిల్లీ: దేశంలో మళ్లీ రెండు నెలల తర్వాత ఒకేరోజు అత్యధిక కరోనా కేసులు వెలుగు చూశాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా...
26-08-2021
Aug 26, 2021, 06:30 IST
లండన్‌: అమెరికా ఫార్మసీ దిగ్గజం ఫైజర్, బ్రిటన్‌ యూనివర్సిటీ ఆక్స్‌ఫర్డ్‌– ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్‌ల సామర్థ్యం ఆరు నెలల్లోనే తగ్గిపోతుందని...
25-08-2021
Aug 25, 2021, 17:38 IST
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 71,532 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,601 మందికి కరోనా...
25-08-2021
Aug 25, 2021, 11:39 IST
జెనీవా: భారత్‌లో కరోనా ఎప్పటికీ ఉండిపోయే వ్యాధి దశలోకి మారుతోందని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. మరికొన్ని రోజులు కోవిడ్ ఇలానే ఉండే అవకాశం...
23-08-2021
Aug 23, 2021, 15:17 IST
కరోనా థర్డ్‌ వేవ్‌ ఊహాగానాలకు చెక్‌ పెట్టడంతో పాటు.. రెండోదశలో వైరస్‌ ఉద్ధృతిని కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు...
23-08-2021
Aug 23, 2021, 12:39 IST
సాక్షి, అమరావతి:రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ 44 ఏళ్లు దాటిన వారికి ఇప్పటికే ఉధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఇక 18 –...
23-08-2021
Aug 23, 2021, 12:23 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి కొనసాగుతూనే ఉంది. కొద్ది రోజుల నుంచి భారత్‌లో సెకండ్‌ వేవ్‌ ఉధృతి కొద్దిగా...
23-08-2021
Aug 23, 2021, 11:37 IST
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ తీవ్రత తగ్గుముఖం పడుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా  25,072 కరోనా...
22-08-2021
Aug 22, 2021, 17:22 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 57,745 మందికి కరోనా పరీక్షలు జరపగా 1,085 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌ ప్రభావంతో 8 మంది మృతి...
22-08-2021
Aug 22, 2021, 12:46 IST
సాక్షి, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ, కంటోన్మెంట్‌ ప్రాంతాల్లో  కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ స్పెషల్‌డ్రైవ్‌ ఈ నెల 23 నుంచి 10– 15 రోజులపాటు...
22-08-2021
Aug 22, 2021, 10:49 IST
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటలలో దేశంలో.. కొత్తగా 30,948 కరోనా కేసులు...
21-08-2021
Aug 21, 2021, 03:21 IST
పన్నెండేళ్లు దాటిన పిల్లలకూ ఇవ్వగలిగిన సరికొత్త కరోనా టీకా సిద్ధమైంది.
21-08-2021
Aug 21, 2021, 00:53 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ వేసుకున్నప్పటికీ భారత్‌లో డెల్టా వేరియెంట్‌ కేసులు అధిక మొత్తంలో వెలుగు చూస్తున్నాయని కరోనా వైరస్‌ జన్యుక్రమాన్ని...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top