‘అతనిలో నాయకత్వ లక్షణాలు పుష్కలం' | Cricketer Vinay Kumar Interesting Comments On Dinesh Karthik | Sakshi
Sakshi News home page

‘అతనిలో నాయకత్వ లక్షణాలు పుష్కలం'

Mar 23 2018 12:02 PM | Updated on Mar 23 2018 12:02 PM

Cricketer Vinay Kumar Interesting Comments On Dinesh Karthik - Sakshi

దినేశ్‌ కార్తీక్‌

కోల్‌కతా: నిదహాస్‌ ట్రోఫీ ఫైనల్‌లో అద్భుత ప్రదర్శన చేసి భారత జట్టుకు కప్‌ అందించిన దినేశ్‌ కార్తీక్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా టీమిండియా బౌలర్‌ వినయ్‌కుమార్‌, కార్తీక్‌ గొప్ప ఆటగాడని, అంతకు మించి గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నాయని కొనియాడాడు. వీరిద్దరు ఐపీఎల్‌లో కోల్‌కతా తరుపున ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. గౌతం గంభీర్‌ కోల్‌కతా జట్టును విడిచి ఢిల్లీకి వెళ్లడంతో టీం మేనేజ్‌ మెంట్‌ దినేశ్‌ కార్తీక్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పింది.

దీనిపై స్పందించిన వినయ్‌కుమార్‌.. తమిళనాడు, ఇండియా రెడ్‌ జట్లకు కార్తీక్‌ నాయకత్వం వహించాడని, ఆ అనుభవంతో కోల్‌కతా జట్టును ఐపీఎల్‌లో విజయతీరాలకు తీసుకెళ్తాడని ఈ కర్ణాటక కెప్టెన్‌ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతమున్న జట్టుపై సంతృప్తి వ్యక్తం చేసిన వినయ్‌.. సీనియర్లు, జూనియర్లతో సమతుల్యంగా ఉందని ఆనందం వ్యక్తం చేశాడు.  ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఆంపైర్‌ సమీక్షా పద్దతిని ప్రవేశ పెట్టడం ద్వారా ఆటగాళ్లకు ఎంతో మేలు కలుగుతుందని వినయ్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. రంజీలో కూడా డీఆర్‌ఎస్‌ ప్రవేశపెడితే బాగుంటుందని వినయ్‌ అభిప్రాయపడ్డాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement