
చీర్‌లీడర్స్ గదులపై పోలీసుల దాడి
ఈసారి ఐపీఎల్‌లో చీర్‌లీడర్స్‌కు చేదు అనుభవం ఎదురైంది. రాయ్‌పూర్‌లోని ఓ హోటల్‌లో చీర్‌లీడర్స్ ఉన్న గదులపై స్థానిక పోలీసులు దాడి చేసి సుమారు గంటసేపు వారిని విచారించారు.
రాయ్‌పూర్ : ఈసారి ఐపీఎల్‌లో చీర్‌లీడర్స్‌కు చేదు అనుభవం ఎదురైంది. రాయ్‌పూర్‌లోని ఓ హోటల్‌లో చీర్‌లీడర్స్ ఉన్న గదులపై స్థానిక పోలీసులు దాడి చేసి సుమారు గంటసేపు వారిని విచారించారు. అయితే ఇది తమ ‘రొటీన్’లో భాగమేనని పోలీసులు తెలిపారు. ఢిల్లీతో మ్యాచ్ కోసం వచ్చిన చెన్నై జట్టు చీర్‌లీడర్స్ ఉన్న గదులపై కోత్వాలీ అనే స్టేషన్‌కు సంబంధించిన పోలీసులు ఎలాంటి వారెంట్ లేకుండా దాడి చేశారు. దీంతో చీర్‌లీడర్స్ తమ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ప్రతినిధులకు ఫోన్ చేశారు.
వీరంతా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన వారు. ‘మేం వర్క్ పర్మిట్‌తో భారత్ వచ్చాం. మేం ఇక్కడ ఎలాంటి తప్పూ చేయడం లేదు. గతంలో మాకు ఎప్పుడూ ఇలాంటి అనుభవం ఎదురుకాలేదు. పోలీసులు మమ్మల్ని అతిగా వేధించారు’ అని ఓ చీర్‌లీడర్ తెలిపింది. అయితే తాము పద్ధతి ప్రకారమే బాధ్యతలు నిర్వర్తించామని పోలీసులు చెబుతున్నారు. ‘కొందరు విదేశీ మహిళలు ఓ హోటల్‌లో దిగారని మాకు సమాచారం వచ్చింది. దీంతో రొటీన్ ప్రకారం వెళ్లి వారు ఎవరో కనుక్కున్నాం’ అని రాయ్‌పూర్ పోలీసులు చెబుతున్నారు.