హైదరాబాద్, మహారాష్ట్ర మ్యాచ్ డ్రా | Colonel ck naidu under 23 match between hyderabad and maharashtra drawn | Sakshi
Sakshi News home page

హైదరాబాద్, మహారాష్ట్ర మ్యాచ్ డ్రా

Oct 28 2016 10:50 AM | Updated on Oct 8 2018 5:45 PM

కల్నల్ సీకే నాయుడు అండర్-23 క్రికెట్ టోర్నీలో భాగంగా హైదరాబాద్, మహారాష్ట్ర జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రా గా ముగిసింది.

కల్నల్ సీకే నాయుడు టోర్నీ   

 సాక్షి, హైదరాబాద్: కల్నల్ సీకే నాయుడు అండర్-23 క్రికెట్ టోర్నీలో భాగంగా హైదరాబాద్, మహారాష్ట్ర జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రా గా ముగిసింది. నాలుగోరోజు ఆటను 54/3 ఓవర్‌నైట్ స్కోరుతో ప్రారంభించిన హైదరాబాద్ రెండో ఇన్నింగ్‌‌సలో 253 పరుగులకు ఆలౌటైంది. రాధాకృష్ణ (99) తృటిలో సెంచరీని చేజార్చుకోగా... తనయ్ త్యాగరాజన్ (50) అర్ధసెంచరీ చేశాడు.

 

అనంతరం 146 పరుగుల లక్ష్య ఛేదన కోసం రెండో ఇన్నింగ్‌‌సను ప్రారంభించిన మహారాష్ట్ర ఆట ముగిసే సమయానికి 7.5 ఓవర్లలో 3 వికెట్లకు 40 పరుగులు చేసి మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. హైదరాబాద్ బౌలర్లలో రాధాకృష్ణ 2 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించిన మహారాష్ట్రకు 3 పాయింట్లు దక్కగా... హైదరాబాద్ ఖాతాలో ఒక పాయింట్ చేరింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement