నాకౌట్‌కు కొలంబియా, గ్రీస్ | Colombia Pulls Away From Japan to Win Group C | Sakshi
Sakshi News home page

నాకౌట్‌కు కొలంబియా, గ్రీస్

Jun 26 2014 1:20 AM | Updated on Oct 22 2018 5:58 PM

నాకౌట్‌కు కొలంబియా, గ్రీస్ - Sakshi

నాకౌట్‌కు కొలంబియా, గ్రీస్

ప్రపంచకప్‌లో గత చరిత్ర ఘనంగా ఏమీలేదు... ఈసారి కూడా పెద్దగా అంచనాలు లేవు... వీలైనంత మేరకు తమ సత్తా ప్రదర్శించడం, అవకాశమొస్తే విజయం సాధించడం...

జపాన్, ఐవరీకోస్ట్ నిష్ర్కమణ
 ప్రపంచకప్‌లో గత చరిత్ర ఘనంగా ఏమీలేదు... ఈసారి కూడా పెద్దగా అంచనాలు లేవు... వీలైనంత మేరకు తమ సత్తా ప్రదర్శించడం, అవకాశమొస్తే విజయం సాధించడం... ఇదే అంచనాలతో బరిలోకి దిగాయి కొలంబియా, గ్రీస్ జట్లు. కానీ విశేషంగా రాణించి గ్రూప్ ‘సి’ నుంచి వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచి నాకౌట్ దశకు చేరుకున్నాయి.
 
  కొలంబియా మూడు మ్యాచ్‌ల్లోనూ తిరుగులేని విజయాలు సాధించగా, చావో, రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో గ్రీస్ సత్తా చాటింది. బుధవారం తెల్లవారుజామున జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌ల్లో కొలంబియా 4-1 తేడాతో జపాన్‌పై ఘనవిజయం సాధించగా, గ్రీస్ జట్టు 2-1తో ఐవరీకోస్ట్‌ను ఓడించి తొలిసారి గ్రూప్ దశను దాటింది. మరోవైపు ఐవరీ కోస్ట్ తమ చివరి మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా నాకౌట్ చేరే స్థితిలో... ఆఖరి నిమిషాల్లో ఓడింది.
 

Advertisement
 
Advertisement
Advertisement