
జమైకా: ప్రపంచకప్‌లో పాల్గొనే విండీస్ జట్టుకు విధ్వంసక ఓపెనర్ క్రిస్ గేల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించారు. గేల్‌కు ఇంగ్లండ్‌లో జరిగే వన్డే ప్రపంచకప్ ఐదో ఈవెంట్. దీంతోనే అతను వన్డే కెరీర్‌కు గుడ్‌బై చెప్పనున్నాడు. అయితే యథావిధిగా ప్రపంచ టి20 లీగ్‌లలో మాత్రం అతను మెరుపులు మెరిపిస్తాడు. ‘విండీస్‌కు ప్రాతినిధ్యం వహించడాన్ని నేనెప్పుడూ గౌరవంగా భావిస్తాను. ఈ ప్రపంచకప్ నాకు మరింత ప్రత్యేకమైంది.
సీనియర్ ప్లేయర్‌గా కెప్టెన్‌కు అండగా ఉంటాను. జట్టును ముందుండి నడిపిస్తాను. జట్టులో ప్రతి ఒక్కరు విండీస్ విజయం కోసం పాటుపడతారు’ అని 39 ఏళ్ల గేల్ అన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌లో పంజాబ్ తరఫున బరిలోకి దిగిన గేల్ 490 పరుగులతో బ్యాట్స్‌మన్ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. లీగ్ దశలో కింగ్స్ ఎలెవన్ ఇంటిబాట పట్టడంతో అతనిప్పుడు ప్రపంచకప్ తుది సన్నాహాల్లో బిజీగా ఉన్నాడు. మంచి ఫామ్‌లో ఉన్న గేల్ సొంతగడ్డపై జరిగిన వన్డే సిరీస్‌లోనూ అదరగొట్టాడు. రెండేసి సెంచరీలు, అర్ధ సెంచరీలు బాదాడు. ఇప్పటివరకు తన కెరీర్‌లో 289 వన్డేలాడిన గేల్ 38.16 సగటుతో 10,151 పరుగులు చేశాడు.