చిలీ అభిమానుల విధ్వంసం | Chile fans destruction in football world cup match | Sakshi
Sakshi News home page

చిలీ అభిమానుల విధ్వంసం

Jun 20 2014 12:57 AM | Updated on Oct 22 2018 5:58 PM

ప్రపంచకప్‌లో స్పెయిన్‌తో మ్యాచ్ సందర్భంగా చిలీ అభిమానులు బీభత్సం సృష్టించారు.

రియో డి జనీరో: ప్రపంచకప్‌లో స్పెయిన్‌తో మ్యాచ్ సందర్భంగా చిలీ అభిమానులు బీభత్సం సృష్టించారు. బుధవారం అర్ధరాత్రి ఇరు జట్ల మధ్య మ్యాచ్‌ను చూసేందుకు రియో డి జనీరోలోని మారకానా స్టేడియంలోకి ఎర్ర జెర్సీ ధరించిన అభిమానులు ఎగబడ్డారు. దీంతో పరిస్థితి చేయిదాటిపోయింది. కొందరు మీడియా సెంటర్ అద్దాలను పగుల గొట్టగా... మరికొందరు కంచెలను దాటుకుని, గోడలను పగులగొట్టి లోపలికి దూసుకొచ్చారు. అయితే సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకుని 85 మందిని అరెస్ట్ చేశారు.

5 వేల మంది పోలీసులు, 1500 మంది సెక్యూరిటీ సిబ్బంది స్టేడియం పరిసరాల్లోనే ఉన్నప్పటికీ చిలీ అభిమానులు రక్షణ వలయాన్ని దాటుకుని రావడంపై ఫిఫా ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో చిలీ అభిమానులను దేశం విడిచి వెళ్లాలని పోలీసు అధికారులు ఆదేశించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement