మా గేమ్ ప్లాన్ అదే: లంక కెప్టెన్

Chandimal speaks about his game plan against India - Sakshi

కోల్‌కతా : భారతగడ్డ మీద టీమిండియాపై ఒక్క టెస్ట్ కూడా నెగ్గని శ్రీలంక ఈ సిరీస్‌లోనైనా కనీసం ఒక్క టెస్ట్ మ్యాచ్ నెగ్గి బోణీ కొట్టాలని భావిస్తోంది. నేడు తొలి టెస్ట్ నేపథ్యంలో లంక కెప్టెన్ చండిమాల్‌ తమ గేమ్ ప్లాన్ గురించి మాట్లాడాడు. 'భారత్ లాంటి పటిష్ట జట్టుతో వారి గడ్డపై ఆడటం మాకు నిజంగా పెద్ద సవాల్. అందుకే బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టును ఎదుర్కోని, వారి దూకుడుకు ముకుతాడు వేయడానికి ఐదుగురు బౌలర్ల వ్యూహంతో బరిలోకి దిగనున్నాం. అయితే 20 భారత వికెట్లు తీస్తేనే మ్యాచ్ మా సొంతమవుతుంది.

ఐదు రోజులు సుదీర్ఘంగా బ్యాటింగ్, బౌలింగ్‌లలో రాణించినా, ఫీల్డింగ్‌లోనూ అద్బుత ప్రదర్శన చేస్తేనే భారత్ లాంటి జట్టుపై విజయం సాధ్యం. అబుదాబీలో పరిస్థితి చాలా భిన్నంగా ఉంటుంది. అక్కడ పిచ్‌లకు, భారత పిచ్‌లకు సంబంధమే ఉండదు. ఈడెన్ పిచ్ నిన్న చూశాం. పచ్చికతో ఉన్నా చాలా హార్డ్‌గా ఉంది. ఏ జట్టు సీమర్లు రాణిస్తే.. వారిదే పైచేయి అవుతుందని' లంక కెప్టెన్ చండిమాల్‌ అభిప్రాయపడ్డాడు.

అయితే కోల్‌కతాలో వర్షం కారణంగా లంచ్ సమయానికి కూడా టాస్ వేయలేదు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top