ఏమిరా చహల్‌.. మొన్న వీధిలో.. ఇప్పుడు ఇంట్లో! | Chahal's First TikTok Video With Dad, Turns Into Meme Fest | Sakshi
Sakshi News home page

ఏమిరా చహల్‌.. మొన్న వీధిలో.. ఇప్పుడు ఇంట్లో!

Mar 27 2020 11:10 AM | Updated on Mar 27 2020 1:57 PM

Chahal's First TikTok Video With Dad, Turns Into Meme Fest - Sakshi

న్యూఢిల్లీ: ఒకవైపు కరోనా వైరస్‌ విజృంభణతో అంతా ఆందోళనలో ఉంటే టీమిండియా స్పిన్నర్‌ యజ్వేంద్ర చహల్‌ మాత్రం ఏదొకటి చేసి అలరిం‍చడమే తన స్టైల్‌ అంటున్నాడు. కొన్ని రోజుల క్రితం ఒక అమ్మాయితో కలిసి అవుట్‌ డోర్‌లో ఒక  టిక్‌టాక్‌ వీడియో చేశాడు. అందులో చహల్‌ను ఆట పట్టించే యత్నం చేసిన ఆ ‘మోడలింగ్‌ గర్ల్‌’.. చివరగా అతను బుగ్గలు నిమిరేసి పరుగులు తీస్తోంది. ఈ వీడియో ఒక లవ్‌ స్టోరీని తలపించేదిగా ఉండటంతో అభిమానులు బాగానే పండగ చేసుకున్నారు. అదే సమయంలో చహల్‌ వేషాలు మాత్రం తగ్గలేదు అని చమత్కరించిన వారు కూడా ఉన్నారు. (చహల్‌ వేషాలు మాత్రం తగ్గలేదు..)

కాగా, తాజాగా చహల్‌ మరో టిక్‌టాక్‌ వీడియో చేశాడు.  అయితే ఇక్కడ చహల్‌ తన తండ్రిని ఎంచుకున్నాడు. బ్యాక్‌ గ్రౌండ్‌లో వచ్చే ఒక ఫన్నీ డైలాగ్‌కు తండ్రితో కలిసి బేసిక్‌ డ్యాన్స్‌ మూమెంట్స్‌ చేశాడు. దీన్ని ట్వీటర్‌లో పోస్ట్‌ చేసిన చహల్‌.. ఇది తన తండ్రితో చేసిన తొలి టిక్‌టాక్‌ వీడియో అని పోస్ట్‌ చేశాడు. దీనికి నెటిజన్లు మీమ్స్‌తో సమాధానం చెబుతున్నారు. ఏమిరా చహల్‌.. నువ్వు ఇలా చేస్తూనే ఉంటావా అని ప్రశ్నిస్తున్నారు. ‘మొన్న వీధిలో అమ్మాయితో కలిసి వీడియో.. ఇప్పుడు ఇంట్లో తండ్రితో కలిసి వీడియో.. చూడలేకపోతున్నాం’ అని ఒక అభిమాని కా​మెంట్‌  చేశాడు. అదే సమయంలో వాంతి చేసుకునే మీమ్‌ను పోస్ట్‌ చేశాడు. ‘  ఈ లాక్‌డౌన్‌లో కెమెరాలు కూడా బంద్‌ చేయండ్రా నాయనా’ అని మరొకరు  కామెంట్‌ చేశాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement