చైనా ఓపెన్‌ చాంప్స్‌ కరోలినా మారిన్, మొమోటా

Carolina Marin Beats Tai Tzu Ying in Final to Win Title on Injury Return - Sakshi

షాంఘై: స్పెయిన్‌ బ్యాడ్మింటన్‌ స్టార్‌ కరోలినా మారిన్‌ పునరాగమనంలో బరిలోకి దిగిన రెండో టోర్నమెంట్‌లోనే టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆదివారం ముగిసిన చైనా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 టోరీ్నలో మారిన్‌ విజేతగా నిలిచింది. అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన మారిన్‌ 65 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో 14–21, 21–17, 21–18తో రెండో సీడ్‌ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ)పై గెలిచింది. ‘నమ్మశక్యంగా లేదు. గాయం నుంచి కోలుకుంటున్న క్రమంలో బరిలోకి దిగే రెండో టోరీ్నలోనే విజేతగా నిలుస్తానని ఊహించలేదు.

ఈ ప్రదర్శనతో నేను చాలా సంతృప్తిగా ఉన్నాను’ అని రియో ఒలింపిక్స్‌ చాంపియన్‌ అయిన మారిన్‌ వ్యాఖ్యానించింది. పురుషుల సింగిల్స్‌ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్, విశ్వవిజేత కెంటో మొమోటా టైటిల్‌ దక్కించుకున్నాడు. 90 నిమిషాలపాటు జరిగిన మారథాన్‌ ఫైనల్లో మొమోటా 19–21, 21–17, 21–19తో ఆంథోనీ జిన్‌టింగ్‌ (ఇండోనేసియా)పై అద్భుత విజయం సాధించాడు. విజేతగా నిలిచిన మారిన్, మొమోటాలకు 70 వేల డాలర్ల (రూ. 49 లక్షల 75 వేలు) చొప్పున ప్రైజ్‌మనీ లభించింది.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top