టీటీ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో కాంస్యమే | Bronze for Sharath-Manika in table tennis | Sakshi
Sakshi News home page

టీటీ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో కాంస్యమే

Aug 30 2018 1:08 AM | Updated on Aug 30 2018 1:08 AM

 Bronze for Sharath-Manika in table tennis - Sakshi

టేబుల్‌ టెన్నిస్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ సెమీ ఫైనల్స్‌లో భారత జోడీ ఆచంట శరత్‌ కమల్‌–మనికా బాత్రా పరాజయం పాలై కాంస్యంతో సరిపెట్టుకుంది. బుధవారం సెమీస్‌లో చైనాకు చెందిన ఇంగ్షా సన్‌– వాంగ్‌ సన్‌ జంట 11–9, 11–5, 11–13, 11–4, 11–8 తేడాతో భారత జోడీని ఓడించింది. అంతకుముందు క్వార్టర్స్‌లో భారత్‌ 4–11, 12–10, 6–11, 11–6, 11–8తో ఉత్తర కొరియాపై, ప్రికార్వర్ట్స్‌లో 11–7, 7–11, 11–8, 10–12, 11–4 స్కోరుతో దక్షిణ కొరియాపై గెలుపొందింది. 

Advertisement
 
Advertisement
Advertisement