
ఏఎన్‌యూ: జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రెండో రోజు ఆంధ్రప్రదేశ్ (ఏపీ) పతకాల బోణీ చేసింది. అండర్–20 పురుషుల 110 మీటర్ల హర్డిల్స్‌లో ఏపీ అథ్లెట్ జి. గోపీచంద్ కాంస్య పతకాన్ని సాధించాడు. ఫైనల్లో గోపీచంద్ 14.25 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచాడు.
పశ్చిమ గోదావరి జిల్లా ఎర్రన్నగూడెంకి చెందిన గోపీచంద్ రాజమండ్రి ఎస్‌కేవీటీ డిగ్రీ కాలేజిలో చదువుతున్నాడు.