ఔబోపన్న జంట ఓటమి | bopanna couple defeat | Sakshi
Sakshi News home page

ఔబోపన్న జంట ఓటమి

Aug 10 2015 3:18 AM | Updated on Sep 3 2017 7:07 AM

సిటీ ఓపెన్ ఏటీపీ టెన్నిస్ టోర్నమెంట్‌లో రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) జోడీ పోరాటం ముగిసింది...

వాషింగ్టన్: సిటీ ఓపెన్ ఏటీపీ టెన్నిస్ టోర్నమెంట్‌లో రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) జోడీ పోరాటం ముగిసింది. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో బోపన్న-మెర్జియా ద్వయం 3-6, 4-6తో టాప్ సీడ్ బాబ్ బ్రయాన్-మైక్ బ్రయాన్ (అమెరికా) జంట చేతిలో ఓడిపోయింది. 55 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జంట మూడు ఏస్‌లు సంధించి, ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తమ ప్రత్యర్థి జంట సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసి, తమ సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయింది.

Advertisement
 
Advertisement
Advertisement