నిర్ణయం జేపీ గ్రూప్‌దే! | Bernie Ecclestone comment on the Indian Grand Prix | Sakshi
Sakshi News home page

నిర్ణయం జేపీ గ్రూప్‌దే!

May 29 2015 1:11 AM | Updated on Sep 3 2017 2:50 AM

వచ్చే ఏడాది ఇండియన్ గ్రాండ్ ప్రి జరగడం రేస్ ప్రమోటర్ జేపీ గ్రూప్‌పైనే ఆధారపడి ఉందని ఎఫ్-1 చీఫ్ బెర్నీ ఎకెల్‌స్టోన్ అన్నారు.

ఇండియన్ గ్రాండ్‌ప్రిపై ఎకెల్‌స్టోన్ వ్యాఖ్య

 న్యూఢిల్లీ : వచ్చే ఏడాది ఇండియన్ గ్రాండ్ ప్రి జరగడం రేస్ ప్రమోటర్ జేపీ గ్రూప్‌పైనే ఆధారపడి ఉందని ఎఫ్-1 చీఫ్ బెర్నీ ఎకెల్‌స్టోన్ అన్నారు. ఈ విషయం తేల్చుకోవడానికి వాళ్లకు చాలా తక్కువ సమయం ఉందని స్పష్టం చేశారు. ఓవరాల్‌గా జేపీ గ్రూప్ స్పందన కోసం తాము వేచి చూస్తున్నామని చెప్పిన ఆయన భారత్‌లో రేసు జరిగితే బాగుంటుందన్నారు. ‘దాదాపు ఆరు నెలల తర్వాత జేపీఎస్‌ఐ చీఫ్ సమీర్ గౌర్‌తో జరిగిన చర్చలు ఫలవంతంగా ముగిశాయి. 2016లో రేసు నిర్వహణ కోసం కసరత్తులు చేస్తున్నారు. రష్యా గ్రాండ్ ప్రి సందర్భంగా జరిగిన చర్చల్లో కూడా సానుకూలాంశాలే కనిపించాయి. కాబట్టి ఇండియన్ గ్రాండ్ ప్రి జరుగుతుందని నమ్ముతున్నా’ అని ఎకెల్‌స్టోన్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement