‘అర్జున’కు నలుగురు క్రికెటర్ల పేర్లు సిఫార్సు

BCCI recommends four cricketers for the Arjuna Award - Sakshi

ముంబై: ప్రతిష్ఠాత్మక అర్జున పురస్కారానికి భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) ప్రతిపాదనలు పంపింది.  2019 అర్జున అవార్డులకు సంబంధించి ముగ‍్గురు పురుష క్రికెటర్లతో పాటు ఒక మహిళా క్రికెటర్‌ పేరును బీసీసీఐ ప్రతిపాదించింది. టీమిండియా క్రికెటర్లలో స్టార్‌ బౌలర్లు బుమ్రా, మహమ్మద్‌ షమీ, ఆల్‌ రౌండర్‌ రవీంద్ర జడేజా పేర్లను ప్రతిపాదించగా.. మహిళా క్రికెటర్లలో పూనమ్‌ యాదవ్‌ పేరును సూచించింది. సుప్రీం కోర్టు నియమించిన పాలకుల కమిటీతో క్రికెట్‌ జీఎం సాబా కరీమ్‌ సమావేశమై వీరి పేర్లను సిఫార్సు చేశారు.

ఇటీవల కాలంలో బుమ్రా నిలకడగా రాణిస్తూ టీమిండియా ప్రధాన పేసర్‌గా సేవలందిస్తున్నాడు. అదే సమయంలో షమీ తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకుని భారత జట్టులో కీలక బౌలర్‌గా మారిపోయాడు. ఇక రవీంద్ర జడేజా టెస్టుల్లో, వన్డేల్లో ఆల్‌రౌండర్‌గా ఆకట్టుకుంటున్నాడు. వరల్డ్‌కప్‌కు ఎంపిక చేసిన జట్టులో రవీంద్ర జడేజా మూడో స్పిన్నర్‌గా చోటు దక్కిం‍చుకున్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top