'అందుకే పాక్లో ఆఫ్రిదిని విమర్శిస్తున్నారు' | BCCI criticises Shahid Afridi for comment on Kashmir | Sakshi
Sakshi News home page

'అందుకే పాక్లో ఆఫ్రిదిని విమర్శిస్తున్నారు'

Mar 23 2016 2:54 PM | Updated on Sep 3 2017 8:24 PM

'అందుకే పాక్లో ఆఫ్రిదిని విమర్శిస్తున్నారు'

'అందుకే పాక్లో ఆఫ్రిదిని విమర్శిస్తున్నారు'

టి-20 ప్రపంచ కప్లో ఆడేందుకు భారత్కు వచ్చిన పాకిస్తాన్ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలతో విమర్శలపాలవుతున్నాడు.

న్యూఢిల్లీ: టి-20 ప్రపంచ కప్లో ఆడేందుకు భారత్కు వచ్చిన పాకిస్తాన్ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలతో విమర్శలపాలవుతున్నాడు. మొహాలీలో న్యూజిలాండ్తో జరిగే మ్యాచ్కు కశ్మీర్ ప్రజలు చాలామంది తమకు మద్దతుగా తరలివస్తారంటూ ఆఫ్రిది చేసిన వ్యాఖ్యలను బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ తప్పుపట్టారు. 'ఆఫ్రిది ఇలాంటి ప్రకటన చేయడం రాజకీయంగా సరికాదు. క్రీడాకారులు ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. పాక్లో ఆఫ్రిదిని విమర్శించడానికి ఇదే కారణం' అని ఠాకూర్ అన్నాడు.

ఆఫ్రిది ఇప్పటికే పెద్ద వివాదంలో ఇరుకున్న సంగతి తెలిసిందే. పాక్లో కంటే భారత్‌లోనే తమకు ఎక్కువ అభిమానం లభిస్తోందని ఆఫ్రిది వ్యాఖ్యలు చేయడంతో స్వదేశంలో తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రపంచ కప్లో పాక్ వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడిపోవడం కూడా అతనికి ఇబ్బందికరంగా మారింది. ప్రపంచ కప్ తర్వాత ఆఫ్రిదిని జట్టు సారథిగా తొలగిస్తామని ఇప్పటికే పీసీబీ ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement