గెలుచుకున్నదంతా కార్చిచ్చు బాధితులకే | Barty To Donate Brisbane Prize Money To Australian Fire Relief | Sakshi
Sakshi News home page

గెలుచుకున్నదంతా కార్చిచ్చు బాధితులకే

Published Mon, Jan 6 2020 10:34 AM | Last Updated on Mon, Jan 6 2020 10:34 AM

Barty To Donate Brisbane Prize Money To Australian Fire Relief - Sakshi

బ్రిస్బేన్‌ టెన్నిస్‌ టోర్నీ ఆడటం ద్వారా తనకు రానున్న మొత్తాన్ని ఆస్ట్రేలియా కార్చిచ్చు బాధితులకే అందజేస్తానని ప్రపంచ నంబర్‌వన్‌ యాష్లే బార్టీ  ప్రకటించింది. ఆసీస్‌కు చెందిన ఈ 23 ఏళ్ల క్రీడాకారిణి గత నవంబర్‌లో ‘జంతువులపై క్రూరత్వ నివారణ’కు పాటుపడుతోన్న రాయల్‌ సొసైటీకి 30 వేల ఆస్ట్రేలియన్‌ డాలర్లు అందజేశానని తెలిపింది.

తాజాగా ఆస్ట్రేలియాను చుట్టుముట్టిన దావానలం బాధితుల కోసం రెడ్‌క్రాస్‌కు మరింత ఎక్కువగా విరాళమివ్వాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. నేటి నుంచి ఈనెల 12 వరకు జరుగనున్న ఈ టోర్నీ ఆడటం ద్వారా దాదాపు 2,50,000 అమెరికా డాలర్లు (రూ. కోటీ 79 లక్షలు) ఆమె రెడ్‌క్రాస్‌కు ఇచ్చే వీలుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
Advertisement