చివర్లో గోల్‌ సమర్పించుకొని...

Barreiro Penalty Helps NorthEast Beat Hyderabad - Sakshi

నార్త్‌ ఈస్ట్‌ చేతిలో 1–0తో హైదరాబాద్‌ ఓటమి  

సాక్షి, హైదరాబాద్‌: ఆరంభంలో ప్రదర్శించిన దూకుడును చివర్లో కొనసాగించలేని హైదరాబాద్‌ ఎఫ్‌సీ సొంతగడ్డపై తొలి ఓటమిని మూటగట్టుకుంది. గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ 0–1తో నార్త్‌ఈస్ట్‌ యునైటెడ్‌ ఎఫ్‌సీ చేతిలో ఓడిపోయింది. ఆట మరో నాలుగు నిమిషాల్లో ముగుస్తుందనగా మ్యాక్సిమిలియానో బరీరో (86వ ని.లో) పెనాలీ్టని గోల్‌గా మలిచి నార్త్‌ఈస్ట్‌ను గెలిపించాడు. ఈ గెలుపుతో నార్త్‌ఈస్ట్‌ ఎఫ్‌సీ 8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.

తొలి అర్ధభాగంలో అంచనాలకు మించి ఆడిన హైదరాబాద్‌ రెండో అర్ధభాగంలో తేలిపోయింది. మరోవైపు తొలి 45 నిమిషాల పాటు ఒక్కసారి కూడా ప్రత్యర్థి గోల్‌ పోస్ట్‌పై దాడిచేయలేకపోయిన నార్త్‌ఈస్ట్‌ తర్వాత ఒక్కసారిగా పుంజుకుంది. 4 సార్లు ప్రత్యర్థి గోల్‌ ఏరియాలోకి చొచ్చుకుపోయింది. మ్యాచ్‌ మొత్తంలో 12 గోల్‌ అవకాశాలను సృష్టించుకున్న హైదరాబాద్‌ ఫినిషింగ్‌ లోపంతో ఒక్క గోల్‌నూ నమోదు చేయలేకపోయింది. ఇందులో 9 షాట్లు టార్గెట్‌ పైకి దూసుకెళ్లినా ప్రత్యర్థి చాకచక్యంగా వ్యవహరించి హైదరాబాద్‌ను నిలువరించింది.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top