బెంగళూరుకు బెర్తు.. కోల్కతా ఇంటికే | Bangalore gets play-off berth | Sakshi
Sakshi News home page

బెంగళూరుకు బెర్తు.. కోల్కతా ఇంటికే

May 17 2015 8:08 PM | Updated on Sep 3 2017 2:14 AM

బెంగళూరుకు బెర్తు.. కోల్కతా ఇంటికే

బెంగళూరుకు బెర్తు.. కోల్కతా ఇంటికే

ఐపీఎల్-8లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్ బెర్తు సాధించింది.

బెంగళూరు: ఐపీఎల్-8లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్ బెర్తు సాధించింది. ఆదివారం ఢిల్లీ డేర్ డెవిల్స్, బెంగళూరుల మధ్య జరగాల్సిన చివరి లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. దీంతో ఇరు జట్లకు ఒక్కో పాయింట్ ఇచ్చారు. బెంగళూరు (16) నాకౌట్కు దూసుకెళ్లగా, ఢిల్లీ (11) ఇంతకు ముందే రేసు నుంచి వైదొలిగింది. ఈ మ్యాచ్ లో బెంగళూరు భారీ తేడా ఓడినట్టయితే కోల్ కతాకు అవకాశాలుండేవి. 15 పాయింట్లు సాధించిన కోల్ కతా ఇంటిదారి పట్టింది. చెన్నై, రాజస్థాన్ ప్లే ఆఫ్ బెర్తులు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరో దాని కోసం హైదరాబాద్, ముంబై పోటీపడుతున్నాయి. ఈ రోజు రాత్రి ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ విజేత అర్హత సాధిస్తుంది.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 187 పరుగులు చేసింది.  ఢిల్లీ ఓపెనర్లు క్వింటన్ డికాక్, శ్రేయాస్ అయ్యర్ దాటిగా ఆడటంతో ఆరు ఓవర్లలో ఆ జట్టు 54 పరుగులు చేసింది. అయితే జట్టు స్కోరు 55 పరుగుల వద్ద శ్రేయాస్ అయ్యర్ (20) ఔటయ్యాడు.  క్వింటన్ డికాక్(39 బంతుల్లో 69: 9 ఫోర్లు, 3 సిక్సర్లు), జేపీ డుమిని (47 బంతుల్లో 67: 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్, చాహల్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్షసాధనలో బెంగళూరు 1.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 2 పరుగులు చేసింది. ఈ సమయంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం వచ్చింది. మ్యాచ్ కొనసాగించే పరిస్థితి లేకపోవడంతో రద్దు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement