డోపింగ్‌లో దొరికిన రెజ్లర్ వినోద్ | Australian wrestler Vinod Kumar to be axed from Olympics after doping ban | Sakshi
Sakshi News home page

డోపింగ్‌లో దొరికిన రెజ్లర్ వినోద్

Jul 15 2016 8:08 PM | Updated on Sep 4 2017 4:56 AM

డోపింగ్‌లో దొరికిన రెజ్లర్ వినోద్

డోపింగ్‌లో దొరికిన రెజ్లర్ వినోద్

భారతీయ సంతతికి చెందిన రెజ్లర్ వినోద్ కుమార్ డోపింగ్‌లో దొరికిపోయాడు.

మెల్‌బోర్న్: భారతీయ సంతతికి చెందిన రెజ్లర్ వినోద్ కుమార్ డోపింగ్‌ టెస్టులో దొరికిపోయాడు. 2015లో ఆస్ట్రేలియా పౌరసత్వం పొందిన వినోద్ 66 కేజీల గ్రీకో రోమన్ విభాగంలో ఒలింపిక్‌లో బరిలోకి దిగాల్సి ఉంది. అయితే అల్జీరియాలో జరిగిన ఆఫ్రికన్/ఓసియానియా ఒలింపిక్ క్వాలిఫయర్ పోటీల్లో పాల్గొన్న వినోద్ అక్కడి డోపింగ్ టెస్టులో విఫలమయ్యాడు.

 

అతని ఏ, బీ శాంపిళ్లు పాజిటివ్‌గా తేలడంతో నాలుగేళ్ల సస్పెన్షన్‌కు గురయ్యాడు. అయితే క్రీడామధ్యవర్తిత్వ కోర్టుకు 30 రోజుల్లోగా అప్పీల్ చేసుకునే అవకాశం ఇచ్చారు. వెంటనే వినోద్‌ను ఒలింపిక్స్ జట్టు నుంచి తప్పించాలని రెజ్లింగ్ ఆస్ట్రేలియాకు ఆ దేశ ఒలింపిక్ కమిటీ సూచించింది.

Advertisement
 
Advertisement
Advertisement