సంచలనం: 40సిక్సర్లతో ట్రిపుల్‌ సెంచరీ | Sakshi
Sakshi News home page

సంచలనం: 40సిక్సర్లతో ట్రిపుల్‌ సెంచరీ

Published Mon, Oct 16 2017 12:46 PM

Australian club cricketer carries team with triple century

సాక్షి: ఆస్ట్రేలియాకు చెందిన బిగ్రేడ్‌ క్రికెట్‌ ఆటగాడు మైదానంలో ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించాడు. సింగిల్‌ పరుగు తీసినంత సులువుగా సిక్సర్‌లు కొట్టేశాడు. ఏకంగా ట్రిపుల్‌ సెంచరీ చేశాడు. వివరాల్లోకి వెళ్తే జోష్‌ డన్‌స్టన్‌ అనే ఆస్ట్రేలియన్‌ క్లబ్‌ క్రికెటర్‌, శనివారం జరిగిన ఓ క్లబ్‌ మ్యాచ్లో రెచ్చిపోయాడు. బంతులను అలవోకగా గ్రౌండ్‌ దాటించాడు. 40 సిక్సర్లతో ట్రిపుల్‌ సెంచరీ(307) పూర్తి చేశాడు.

అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన ఐదుగురు ఆటగాళ్లు కలిపితే 47 పరుగులు చేయగా అందులో 18 పరుగులే అత్యధికం. మూడో స్థానంలో వచ్చిన డన్‌స్టన్‌ సిక్సర్లతో రెచ్చిపోయాడు. జట్టు మొత్తం పరుగులు 354 కాగా అందులో డన్‌స్టన్‌ పరుగులే 307 ఉన్నాయి. అంతేకాదు 203 వద్ద నుంచి 307 పరుగులు చేసే లోపు నాన్‌స్ట్రైకర్‌ చేసిన పరుగులు 5మాత్రమే. మొత్తం స్కోర్‌లో 86.72 శాతం పరుగులు డన్‌స్టన్‌ చేసినవే.

ప్రపంచంలో ఇప్పటి వరకూ అన్ని ఫార్మెట్లలో ఈ రికార్డు రిచర్డ్స్‌ పేరుతో ఉన్న రికార్డును తుడిచేశాడు. వెస్టిండీస్‌ 1984లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జట్టు మొత్తం చేసిన పరుగుల్లో(272) రిచర్డ్స్‌ 69.48 శాతం పరుగులు(189) చేశాడు.

Advertisement
 
Advertisement
 
Advertisement