టాప్ ఆర్డర్...టప టపా... | Australia v England: Tri-Series – stumbling start for England | Sakshi
Sakshi News home page

టాప్ ఆర్డర్...టప టపా...

Jan 16 2015 9:54 AM | Updated on Sep 2 2017 7:46 PM

టాప్ ఆర్డర్...టప టపా...

టాప్ ఆర్డర్...టప టపా...

టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ జట్టు వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. టాప్ ఆర్డర్ ఆటగాళ్లు వరుసగా పెవిలియన్ దారి పట్టారు.

సిడ్నీ : టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ జట్టు వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. టాప్ ఆర్డర్ ఆటగాళ్లు వరుసగా పెవిలియన్ దారి పట్టారు. ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు బరిలోకి దిగిన విషయం తెలిసిందే. మొదటి రెండు ఓవర్లలోనే ఇంగ్లండ్ జట్టు రెండు వికెట్లు కోల్పోయింది.

మిచెల్ స్టార్క్ తన బౌలింగ్ మాయాజాలంతో ఇంగ్లండ్ జట్టు పరుగుల ఖాతా తెరవకుండానే వికెట్లు తీశాడు. ఇయాన్ బెల్‌, టేలర్ను ఎల్పీడబ్ల్యూగా డకౌట్ చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన అలీ 22 పరుగుల వద్ద ఫాల్కనర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు.  అయిదు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రూట్ వికెట్ను కమిన్స్  తీశాడు. మోర్గాన్ 14, బొపారా 6 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ఇంగ్లండ్ జట్టు 12 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement